MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/sonusood-baatalo-pop-gayani-smithac18261a3-2cf1-490e-802b-09672f03b34f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/sonusood-baatalo-pop-gayani-smithac18261a3-2cf1-490e-802b-09672f03b34f-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా కోవిడ్ వైర‌స్ ప్ర‌జ‌లను వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని అగ్ర‌దేశాలు కొంత‌వ‌ర‌కు దీనిని నియంత్ర‌ణ‌లోకి తేవ‌డంలో కొంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌య్యాయి. భార‌త్‌లో ప్ర‌స్తుతం వైర‌స్ రెండోవేవ్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. జ‌న‌ జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేస్తోంది. సాయం చేసే చేతుల కోసం ప‌లువురు ఎదురుచూస్తున్నారు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఆసుప‌త్రులు స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆక్సిజ‌న్ అంద‌క అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయsonusood-smithaసోనూసూద్ బాట‌లో పాప్‌గాయ‌ని స్మిత‌సోనూసూద్ బాట‌లో పాప్‌గాయ‌ని స్మిత‌sonusood-smithaWed, 19 May 2021 05:00:00 GMTప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా కోవిడ్ వైర‌స్ ప్ర‌జ‌లను వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని అగ్ర‌దేశాలు దీనిని నియంత్ర‌ణ‌లోకి తేవ‌డంలో కొంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌య్యాయి. భార‌త్‌లో ప్ర‌స్తుతం వైర‌స్ రెండోవేవ్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. జ‌న‌ జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేస్తోంది. సాయం చేసే చేతుల కోసం ప‌లువురు ఎదురుచూస్తున్నారు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఆసుప‌త్రులు స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆక్సిజ‌న్ అంద‌క అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వాలు త‌మ శ‌క్తి మేర‌కు సాధ్య‌మైన అన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నా – సెలబ్రెటీలూ, పారిశ్రామికవేత్త‌లు త‌మ వంతు స‌హాయం చేసి, మాన‌వ‌త్వం చాటుకోవాల్సిన సంద‌ర్భం ఇది. ఈ విష‌యంలో సినీ న‌టుడు సోనూసూద్ అందిస్తున్న సేవ‌లకు దేశ ప్ర‌జ‌లంతా స‌లాం చేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న కృషికి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయ‌న ఇలాంటివేమీ ప‌ట్టించుకోకుండా క‌ర్మ‌యోగిలా త‌న ప‌ని తాను చేసుకువెళుతున్నాడు.

సోనూని స్ఫూర్తిగా తీసుకుని, ఇంకొంత‌మంది సెల‌బ్రెటీలు సంక్షోభ స‌మ‌యంలో తాము కూడా సేవ‌లందించేందుకు ముంద‌డుగు వేస్తున్నారు. క‌ష్ట‌కాలంలో ప‌లువురికి తామున్నామంటూ ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు.  పాప్ గాయ‌నిగా ఎంతోమంది అభిమానుల్సి సంపాదించుకున్న స్మిత కూడా ఇప్పుడు ఇదే బాట‌లో న‌డ‌వ‌బోతోంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న‌వారికి ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు అందుబాటులో తేవ‌డానికి ఆమె త‌న వంతు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు అందుబాటులోకి తీసుకురావ‌డానికి న‌డుం బిగించింది. త‌న‌ స్నేహితులు కొంత‌మందితో క‌లిసి ఓ ట్ర‌స్ట్ లా ఏర్ప‌డి, ప్ర‌ధాన న‌గ‌రాల్లోని కోవిడ్ బాధితుల‌కు ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు అందుబాటులో ఉంచ‌డానికి అవ‌స‌ర‌మైన స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తానేం చేయ‌బోతున్న‌దీ త్వ‌ర‌లోనే అప్‌డేట్ ఇవ్వ‌బోతోంద‌ట‌. ఆమె ప్ర‌య‌త్నం కొంత‌మంది ప్రాణాల్ని నిలబెట్టి, మ‌రికొంత‌మంది సెల‌బ్రిటీల‌కు స్ఫూర్తిగా నిలిస్తే కోవిడ్ బాధితులు కొంద‌రికైనా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

ఇదిలా ఉండ‌గా క‌ష్ట‌కాలంలో పేదల అండగా నిలుస్తున్న‌ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ పేరును వాడుకుని కొంత‌మంది న‌కిలీ సేవా సంస్థ‌ల‌తో విరాళాల సేక‌ర‌ణ మొద‌లుపెట్టార‌ట‌. ఈ మేర‌కు ఆయ‌న‌ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్‌ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సోనూసూద్‌ కోరారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజలకు గుడ్ న్యూస్.. తెలంగాణ మంత్రి గొప్ప నిర్ణయం?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>