MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya150e32af-12d0-411d-bb05-dd2a41c68b1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya150e32af-12d0-411d-bb05-dd2a41c68b1a-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్ సుందరి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో కుర్రకారు మనసు దోచేశారు. భలే భలే మగాడివోయ్ సినిమాలో ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె భరత నాట్యం లో శిక్షణ కూడా తీసుకున్నారు. లావణ్య త్రిపాఠి కెరీర్ మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. భలే భలే మగాడివోయ్ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి కానీ అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. 2018 నుంచి వరుసగా ఐదు సినిమాలు చేయగా వాటిలో ఏ lavanya;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;ramya krishnan;uttarakhand;cinema;tamil;heroine;bhale bhale magadivoy;fidaaనాగ్ చేతిలో లావణ్య కెరీర్?నాగ్ చేతిలో లావణ్య కెరీర్?lavanya;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;ramya krishnan;uttarakhand;cinema;tamil;heroine;bhale bhale magadivoy;fidaaWed, 19 May 2021 17:00:00 GMTఉత్తరాఖండ్ సుందరి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో కుర్రకారు మనసు దోచేశారు. భలే భలే మగాడివోయ్ సినిమాలో ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె భరత నాట్యం లో శిక్షణ కూడా తీసుకున్నారు. లావణ్య త్రిపాఠి కెరీర్ మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. భలే భలే మగాడివోయ్ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి కానీ అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. 2018 నుంచి వరుసగా ఐదు సినిమాలు చేయగా వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఏ వన్ ఎక్స్ప్రెస్ పరమ చెత్తగా ఉండటంతో ఆమెకు ఆ సినిమా కెరీర్ పరంగా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు.



చావు కబురు చల్లగా సినిమాలో చక్కని నటన కనబరిచినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమెకు వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. వాస్తవానికి ప్లాప్ హీరోయిన్ కి కొత్త సినిమాల అవకాశాలు రావటం చాలా కష్టం. ఐతే ప్రస్తుతం లావణ్య కి సినిమా అవకాశాలు మాత్రమే కాదు ఒక హిట్ రావడం కూడా చాలా అవసరం. ఇదిలా ఉండగా.. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ అయిన "బంగార్రాజు" షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు.



అయితే ఈ సీక్వెల్ లో రమ్యకృష్ణ, నాగార్జున నటిస్తుండగా.. లావణ్య త్రిపాఠి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నాగార్జున లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ గా నటించే అవకాశం కల్పిస్తే ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడుతుంది. బంగార్రాజు చిత్ర బృందం కొత్త హీరోయిన్ ని తీసుకుంటే లావణ్య ఒక మంచి ఛాన్స్ కోల్పోయినట్టే అవుతుంది. ఇకపోతే తాజాగా లావణ్య తమిళంలో ‘పొట్టుమ్‌ పొగట్టుమే’ పేరుతో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేశారు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తీరిక లేకుండా దున్నేయడానికి సిద్దమైన ప్రభాస్, పవన్ .... ??

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>