PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus--block-fungus61a58c33-ebb5-4ee4-8fe9-a4830952fb4b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus--block-fungus61a58c33-ebb5-4ee4-8fe9-a4830952fb4b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ తోనే జనాలు అల్లాడుతుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ కూడా దానికి తోడై జనాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకీ ఎక్కువ అవుతుండడం అందరినీ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. CORONAVIRUS - BLOCK FUNGUS;swetha;doctor;sugar;cheque;shakti;coronavirus"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?CORONAVIRUS - BLOCK FUNGUS;swetha;doctor;sugar;cheque;shakti;coronavirusWed, 19 May 2021 09:00:00 GMTప్రస్తుతం కరోనా వైరస్ తోనే జనాలు అల్లాడుతుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ కూడా దానికి తోడై జనాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజు రోజుకీ ఎక్కువ అవుతుండడం అందరినీ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాలలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా చికిత్స సమయంలో ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలోనే బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతోందని అంటున్నారు. దాదాపు పది లక్షల మందిలో ఒకరికి మాత్రమే సోకుతుందని గుర్తించినట్లు పేర్కొన్నారు వైద్యులు. కాబట్టి కరోనా నుండి బయట పడినా కూడా బ్లాక్ ఫంగస్ ఉందా అనే కోణంలో ఒకసారి పరీక్షించుకోవలసిన అవసరం ఉంది అంటున్నారు వైద్యులు.

ఇక దీర్ఘకాలిక వ్యాధులతో  బాధపడేవారిలో ముందుగానే వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. కాబట్టి ఇలాంటి వారికి ఇది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిలో మధుమేహం  కూడా ఒకటి. అయితే డయాబెటిక్ పేషెంట్ లకు బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు.  ప్రముఖ డాక్టర్ శ్వేత బద్యాల్ మరియు సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డయాబెటిక్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ గురించిన పలు అంశాలను వివరించారు. బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదట, ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేదు అని తెలిపారు.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

*ముక్కుపై నల్ల మచ్చలు ఏర్పడటం, లేదా కళ్ళు ఎర్రగా మారడం నొప్పి ఉండటం.

* కళ్ళు మసక మసకగా కనిపించడం.


* తీవ్రమైన జ్వరం ఊపిరి సరిగా ఆడక పోవడం, రక్తపు వాంతులు, నాలుకపై నల్ల మచ్చలు.


* దవడ భాగంలో నొప్పి, వాపు, తిమ్మిర్లు ఉంటాయట.


* చాతిలో నొప్పి కూడా ఉంటుందని తెలియజేశారు.  ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
 
కరోనా వచ్చిన వారు పోషక ఆహారం తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు కూడా వైద్యుల సలహా మేరకు వారి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత షుగర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో షుగర్ పేషెంట్లు స్టెరాయిడ్ లను ఎక్కువ వాడటం మంచిది కాదు. కాబట్టి డాక్టర్ సలహా కచ్చితంగా తీసుకోవాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>