MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marriagefa24d7fe-e4cd-4a2a-b8be-467c967d91c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marriagefa24d7fe-e4cd-4a2a-b8be-467c967d91c5-415x250-IndiaHerald.jpgసినిమా రంగంలో సాధారణంగానే హీరోయిన్లు చాలా లేటుగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం హీరోయిన్స్ ఎందుకో తెలియదు కానీ అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న లేదా పెళ్లయి విడిపోయిన పెద్ద వ్యక్తులతో ప్రేమలో పడి వాళ్ళతో వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. సావిత్రి మొదలు మొన్నటి పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారి అలా ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్లను రెండో లేదా మూడో వివాహం చేసుకున్న హీరోయిన్ జాబితా చూస్తే ఈ విధంగా ఉంది. సావిత్రిactress-richest-husbands;pawan;chiranjeevi;boney kapoor;kumaar;sridevi kapoor;jeevitha rajaseskhar;kalyan;krishna;manjula;prema;radhika;renu desai;sarath kumar;savitri;sharath;tara;vijay;bollywood;cinema;rajani kanth;marriage;love;husband;wife;heroine;joseph vijay;allu sneha;dubai;savithri 1;sharrath marar1;pawan-kalyan;badri;geminiరెండో పెళ్లి భర్తలను వివాహమాడిన హీరోయిన్స్ వీరే!రెండో పెళ్లి భర్తలను వివాహమాడిన హీరోయిన్స్ వీరే!actress-richest-husbands;pawan;chiranjeevi;boney kapoor;kumaar;sridevi kapoor;jeevitha rajaseskhar;kalyan;krishna;manjula;prema;radhika;renu desai;sarath kumar;savitri;sharath;tara;vijay;bollywood;cinema;rajani kanth;marriage;love;husband;wife;heroine;joseph vijay;allu sneha;dubai;savithri 1;sharrath marar1;pawan-kalyan;badri;geminiWed, 19 May 2021 07:00:00 GMTసినిమా రంగంలో సాధారణంగానే హీరోయిన్లు చాలా లేటుగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం హీరోయిన్స్ ఎందుకో తెలియదు కానీ అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న లేదా పెళ్లయి విడిపోయిన పెద్ద వ్యక్తులతో ప్రేమలో పడి వాళ్ళతో వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. సావిత్రి మొదలు మొన్నటి పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఒక్కసారి అలా ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్లను రెండో లేదా మూడో వివాహం చేసుకున్న హీరోయిన్ జాబితా చూస్తే ఈ విధంగా ఉంది. 

 

సావిత్రి : 

సావిత్రి అప్పటికే పెళ్లయి,పిల్లలున్న జెమిని గణేశన్ ని ప్రేమించి పెళ్లాడింది. తనకు పెళ్లి అయినప్పటికీ ప్రేమ లేదని, అదే అసలైన ప్రేమ పెళ్లి అని జెమిని అనడంతో సావిత్రి నమ్మేసి పెళ్లి చేసుకుంది. పెళ్ళయిన తరువాత అతని అఫైర్స్ తట్టుకోలేక చివరికి మందుకు బానిస అయి మరణించింది.

 

శ్రీదేవి 

ఇక చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పింది విని చేసుకుంటూ వచ్చిన శ్రీదేవి తల్లి మరణంతో పెళ్లయిన బోనీ కపూర్ ని రెండో పెళ్లి చేసుకుంది. శ్రీదేవి తల్లికి ఆపరేషన్ అవ్వడం,ఆమె చనిపోవడం, అప్పటికే బాలీవుడ్ లో శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో బోనీకపూర్ పరిచయం ప్రేమగా మారింది. అలా ముందు పెళ్లయిన ఆమెకి విడాకులిచ్చి మరీ శ్రీదేవిని తెలివిగా పెళ్లాడాడు బోనీ కపూర్. చివరకు దుబాయ్ లో ఓ పెళ్లి వేడుకలో ఆమె మరణించింది,

 

విజయనిర్మల 

దర్శకురాలు విజయనిర్మల విషయానికి వస్తే, భర్త సూపర్ స్టార్ కృష్ణ తొలి భార్యతో కూడా ఎంతగానో కలిసిపోయింది. అప్పటికే ఆమెకు పిల్లలు ఉన్నా విజయనిర్మల ఎలాంటి ఇబ్బందులు రాకుండా నెట్టుకొచ్చింది. 

 

మంజుల 

ఇక స్నేహం కోసం సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన నటుడు విజయ్ కుమార్ కి అప్పటికే పెళ్లయి పిల్లలున్నారు. కానీ అలాంటి వ్యక్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన మంజుల ఆయనతో మరో ముగ్గురు ఆడపిల్లలను కన్నారు. 

 

రాధిక 

అలనాటి అందాల తార రాధికకు శరత్ కుమార్ మూడవ భర్త. ఆయనకు ఆమె రెండో భార్య. అంతకుముందు రాధిక ఓ విదేశీ వ్యక్తిని పెళ్ళాడి పిల్లల్ని కూడా కనింది. 

 

రేణు దేశాయ్

 ఇక పవన్ కళ్యాణ్ ని బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ఆయన్ని ప్రేమించి పెళ్లాడింది. అప్పటికే పవన్ కి ఒక పెళ్లి పెటాకులు అయింది. ఇక ఒక కొడుకు ,కూతురు పుట్ట్టాక రేణు - పవన్ లు విడాకులు తీసుకున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ తో మరోసారి " మైండ్ బ్లాక్ " చేయిస్తాడట ?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>