MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands17aea260-50d8-4673-9087-f4d11cc567e6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands17aea260-50d8-4673-9087-f4d11cc567e6-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అందగత్తెల్లో జయప్రద ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సహా హిందీ చిత్ర సీమలను ఏలిన అందగత్తె జయప్రద. ఈ రెండు భాషలే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోని సినీ ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన జయప్రద 1994లో తెలుగు..actress-richest-husbands;amar;jayaprada;ramu;srikanth;telugu desam party;ram madhav;2019;tamil;producer;kannada;mla;hindi;february;wife;woman;producer1;tdp;bengali;march;research and analysis wing;parliament;partyరెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!రెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!actress-richest-husbands;amar;jayaprada;ramu;srikanth;telugu desam party;ram madhav;2019;tamil;producer;kannada;mla;hindi;february;wife;woman;producer1;tdp;bengali;march;research and analysis wing;parliament;partyWed, 19 May 2021 14:00:38 GMTతెలుగు చిత్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అందగత్తెల్లో జయప్రద ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సహా హిందీ చిత్ర సీమలను ఏలిన అందగత్తె జయప్రద. ఈ రెండు భాషలే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోని సినీ ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించిన జయప్రద 1994లో తెలుగు దేశం పార్టీలో చేరారు. సినీ తారగానే కాకుండా ప్రజా ప్రతినిధిగా, ప్రజా నాయకురాలిగా కూడా అందరినీ మెప్పించారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు రాంపూర్ నుంచి ఎంపీగా విధులు నిర్వర్తించారు.


1970 కాలంలో చిత్ర సీమలోకి అడుగుపెట్టిన జయప్రద తన అద్భుత నటనతో అగ్ర హీరోయిన్‌గా నిలిచారు. వాటిలో 1976లో వచ్చిన అంతులేని కథ, సీతా కళ్యాణం, అదే విధంగా 1977లో అడవి రాముడు, యమగోల, సన్నాయి అప్పన్న, ఆ తర్వాత ఏడాది సిరిసిరిమువ్వ వంటి ఎన్నో అద్భుత సినిమాల్లో జయప్రద తాను నటించిన పాత్రలకు ప్రాణం పోశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్ర స్థానానికి చేరుకున్న ఆమె రాజకీయాల్లోనూ అదే జోరును కనబరిచారు. 1994లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె అతి తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. అయితే 1996లో తెలుగు దేశం పార్టీ తరుపున రాజ్య సభకు ఎంపికయ్యారు.



 అంతేకాకుండా తెలుగు మహిళ సంఘానికి అధ్యక్షురాలిగా కూడా విధులు నిర్వర్తించారు. అయితే ఆ తరువాత కొన్నాళ్లకు టీడీపీ నుంచి తప్పుకుని సమజవాద్ పార్టీలో చేరారు. అప్పుడు రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె పార్లమెంటులో ప్రజా ప్రతినిధిగా అద్భుత ప్రజాసేవ అందించారు. ఆ తరువాత ఆమెపై అపనిందలు వేయడంతో పార్టీ నుంచి తొలగి, అమర్ సింగ్‌తో కలిసి సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 2012లో ఉత్తర ప్రేదేశ్‌లో సొంత పార్టీతో పోటీ చేసిన జయప్రద ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయారు. దాంతో వారిద్దరు ఆర్ఎల్‌డీ పార్టీలో చేరారు. అప్పుడు కూడా 2014 ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. దాంతో ఇటీవల 2019 మార్చి 26న జాతీయ సెక్రటరి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.



ఇదిలా ఉంటే జయప్రద 1989 ఫిబ్రవరి 22న నిర్మాత శ్రీకాంత్ నెహతాను వివాహం చేసుకున్నారు. అప్పటికే శ్రీకాంత్ నెహతాకు చంద్ర అనే  ఆమెతో వివాహం అయింది. వారిద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో జయప్రద, శ్రీకాంత్ నెహతా పెళ్ళి సినీ పరిశ్రమలో దుమారం లేపింది. దానికి కారణం శ్రీకాంత్ తన మొదటి భార్య విడాకులు ఇవ్వకుండా జయప్రదను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికి పిల్లలు లేరు. అతడికి పిల్లలు పుట్టకుండా చికిత్స జరిగిందని తెలిసినప్పటికీ జయప్రద ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జయప్రద తన చెల్లెలి కొడుకుని దత్తత తీసుకొని తన కుమారునిగా పెంచుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సిటీలో మరణ మృదంగం..215 మంది మృతి..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>