Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/top-5-heros-who-never-got-into-affairs-with-heroinese21137df-2558-49bf-a449-ff999ca8ca09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/top-5-heros-who-never-got-into-affairs-with-heroinese21137df-2558-49bf-a449-ff999ca8ca09-415x250-IndiaHerald.jpgసినిమా ప్రపంచం ఓ రంగుల ప్రపంచం. అందులో ఎన్నో రంగులుంటాయి. మంచి, చెడు అన్నీ ఉంటాయి. అయితే ఒక్క సారి సినిమా ప్రపంచంలో స్టార్ స్టేటస్ వచ్చిందంటే ఎంతోమంది వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే వేల మంది అభిమానులు వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నటీనటుల మధ్య కూడా ఆకర్షణల నేపథ్యంలో ఎన్నో రిలేషన్స్ పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్‌లు...affairless-celebrities;nithin;emraan hashmi;madhavan;mukesh;salman khan;sohail khan;jeevitha rajaseskhar;prema;ramu;saritha;seema;tara;tiru;bollywood;tollywood;cinema;marriage;love;industry;girl;gift;nithin reddyఒక్క హీరోయిన్‌తో కూడా అఫైర్లు లేని టాప్ 5 హీరోలు వీళ్లే..ఒక్క హీరోయిన్‌తో కూడా అఫైర్లు లేని టాప్ 5 హీరోలు వీళ్లే..affairless-celebrities;nithin;emraan hashmi;madhavan;mukesh;salman khan;sohail khan;jeevitha rajaseskhar;prema;ramu;saritha;seema;tara;tiru;bollywood;tollywood;cinema;marriage;love;industry;girl;gift;nithin reddyWed, 19 May 2021 23:58:07 GMTసినిమా ప్రపంచం ఓ రంగుల ప్రపంచం. అందులో ఎన్నో రంగులుంటాయి. మంచి, చెడు అన్నీ ఉంటాయి. అయితే ఒక్క సారి సినిమా ప్రపంచంలో స్టార్ స్టేటస్ వచ్చిందంటే ఎంతోమంది వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే వేల మంది అభిమానులు వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నటీనటుల మధ్య కూడా ఆకర్షణల నేపథ్యంలో ఎన్నో రిలేషన్స్ పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్లు, డైరెక్టర్లు, ఆర్టిస్ట్‌లు మధ్య ఈ రిలేషన్ షిప్‌లు బలంగా ఏర్పడుతుంటాయి. అయితే ఈ ఎఫైర్స్‌ను సదరు స్టార్ సెలబ్రిటీలు చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ బయటకొచ్చేస్తూ ఉంటాయి. కానీ.. ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అనుభవించినా.. ఎలాంటి ఎఫైర్స్‌లోనూ లేని నటులు కూడా కూడా చాలా మంది ఉన్నారు. అంటే రాముడు మంచి బాలుడు లెక్కన్నమాట. మరి వాళ్లలో టాప్ 5 ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. మాధవన్
హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టకముందు మాధవన్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్‌‌‌లు తీసుకునేవాడు. పబ్లిక్ స్పీకర్‌గా మంచి కెరీర్ ఉండేది. అదే తరహాలో 1991లో మాధవన్ ఓ క్లాస్ తీసుకుంటున్నాడు. ఆ క్లాస్‌కు సరిత బిర్జయ్ అనే ఓ అమ్మాయి హాజరైంది. ఆ క్లాస్ తరువాత ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్‌ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ చేసింది. దీంతో సరిత మాధవన్‌ను థాంక్స్ చెప్పేందుకు డిన్నర్‌కు పిలిచింది. అలా వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. సరిత తన జీవితంలో మొదటి ప్రేమ అని, తనలాంటి వ్యక్తిని సరిత పెళ్లి చేసుకుంటుందని తాను ఎన్నడూ అనుకోలేదని, ఆమె తన జీవితంలో గొప్ప గిఫ్ట్ అని మాధవన్ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏ హీరోయిన్‌తోనూ మాధవన్‌ ఎఫైర్స్‌ పెట్టుకోలేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా లేదు.

2. ఇమ్రాన్ హష్మి
బాలీవుడ్‌ హీరోల్లో అత్యంత రసికుడు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఇమ్రాన్ హష్మి. అయితే ఇమ్రాన్ జీవితంలో మాత్రం అలా కాదు. కేవలం తన భార్యను తప్ప మరే ఇతర నటీనటులతోనూ ఇమ్రాన్ ఎఫైర్స్ నడపలేదని ఇండస్ట్రీ టాక్. 2006 ఇమ్రాన్ తన చిరకాల స్నేహితురాలు పర్వీన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 1996 నుంచి వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో కనిపించినా ఇమ్రాన్ ఏ నటితోనూ హుక్ అప్ కాలేదట. భార్యకు చాలా లాయల్‌గా ఉన్నారట.

3. నీల్ నితిన్ ముఖేష్:
బాలీవుడ్, టాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. చూడ్డానికి హైట్, వెయిట్, కలర్ అన్నీ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాడు. అయినా ఇప్పటివరకు నీల్ ఒక్క సారి కూడా ఏ హీరోయిన్‌తో కానీ, మరే ఇతర నటితో కానీ ఎఫైన్ నడిపినట్లు లేదు. అంతేకాదు నీల్ పెళ్లి కూడా అరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు చూసిన రుక్మిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

4. సోహైల్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా వన్ విమెన్ హీరోనే. బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా మంచి పేరున్న సొహైల్ 1998లో ప్యార్ కియాతో డర్‌నా క్యా అనే సినిమాను మొదటి సారి తెరకెక్కించాడు. అదే సమయంలో అతడికి సీమా సచ్‌దేవ్‌తో సొహైల్‌కు పరిచయమైంది. వీరిద్దరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిందట. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ మతాలు వేరవడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సొహైల్‌కు బాలీవుడ్‌లో ఒక్క ఎఫైర్ కూడా లేదు.

శ్రేయస్ తాల్పడే
శ్రేయస్ తాల్పడే బాలీవుడ్‌లో మంచి పేరున్న నటుడు. సెలబ్రిటీగా 2000 సంవత్సరంలో ఓ కాలేజ్ ఫెస్ట్‌కు శ్రేయస్ వెళ్లాడు. అక్కడే దీప్తి అనే ఓ అమ్మాయిని చూశాడు. ఆమె శ్రేయస్‌కు పెద్ద ఫ్యాన్. అప్పటివరకు శ్రేయస్‌కు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అయితే వీరిద్దరి మధ్య కొద్ది రోజుల్లోనే ప్రేమ పుట్టింది. నాలుగేళ్ల తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రేయస్ గురించి ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఎలాంటి ఎఫైర్ రూమర్స్ కూడా లేవు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ జనసేనతో వైసీపీ ఎమ్మెల్యేకి ఇబ్బందేనా?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>