SmaranaDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/harikrishna-5755ea47-1b28-4e1f-b2f4-e068ce24d3da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/harikrishna-5755ea47-1b28-4e1f-b2f4-e068ce24d3da-415x250-IndiaHerald.jpgహరికృష్ణ కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రజల శ్రేయస్సు కొరకు పోరాటం చేశారు..ఇక ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి "నందమూరి తారకరామారావు " వారసుడిగా నందమూరి హరికృష్ణ రాజకీయంగానూ, సినిమాల్లోనూ స్టార్ కాకపోయినా తెలుగు ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు అనటంలో సందేహం లేదు. తను జీవితంలో స్టార్ గా నిలబడే లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ స్టార్ గా నిలిచాడు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపిHARIKRISHNA;ntr;harika;harikrishnan;jeevitha rajaseskhar;jr ntr;kalyan;kalyan ram;naga chaitanya;ram pothineni;hyderabad;telugu desam party;vijayawada;telangana;cinema;telugu;rajani kanth;nalgonda;marriage;chief minister;car;film industry;industry;success;nandamuri taraka rama rao;father;chaitanya 1;partyహెరాల్డ్ స్మరణ: ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడిన వ్యక్తి హరికృష్ణ..హెరాల్డ్ స్మరణ: ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడిన వ్యక్తి హరికృష్ణ..HARIKRISHNA;ntr;harika;harikrishnan;jeevitha rajaseskhar;jr ntr;kalyan;kalyan ram;naga chaitanya;ram pothineni;hyderabad;telugu desam party;vijayawada;telangana;cinema;telugu;rajani kanth;nalgonda;marriage;chief minister;car;film industry;industry;success;nandamuri taraka rama rao;father;chaitanya 1;partyWed, 19 May 2021 06:30:00 GMT
హరికృష్ణ కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా నిజజీవితంలో కూడా ప్రజల శ్రేయస్సు కొరకు పోరాటం చేశారు..ఇక ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి "నందమూరి తారకరామారావు " వారసుడిగా నందమూరి హరికృష్ణ రాజకీయంగానూ, సినిమాల్లోనూ స్టార్ కాకపోయినా తెలుగు ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు అనటంలో సందేహం లేదు. తను జీవితంలో స్టార్ గా నిలబడే లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ స్టార్ గా  నిలిచాడు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో స్టార్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించబోతున్నానని ప్రకటించారు.


అలా  ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపించి, పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో హరికృష్ణ ఎంతో కృషి చేశారు. ప్రజల గుండెల్లో అన్నగా నిలిచిపోయాడు హరికృష్ణ. ఇక హరికృష్ణ  , ఎన్టీఆర్ పార్టీ పెట్టకముందు సినిమా రంగంలో ప్రవేశించారు . ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరికృష్ణ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ,చిన్న పైరవీ కూడా చేయలేదు. ఇక ఎక్కడ తన తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా తనదైన శైలిలో ముందుకు నడిచాడు హరికృష్ణ..


1999 లో చంద్రబాబు తో విభేదించి, తెలుగుదేశం పార్టీ నుండి విడిపోయి "అన్న తెలుగుదేశం పార్టీని" స్థాపించాడు హరికృష్ణ. ఇక ఈ పార్టీ నుండి  ఓడిపోవడంతో తిరిగి  సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఆ  తర్వాత సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు వంటి చిత్రాలలో నటించి, ఇక ఆ వయసులో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. ఇక ఆ తర్వాత తన ఇద్దరి కొడుకులు అయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను సినీ ఇండస్ట్రీకి, హీరోలుగా పరిచయం చేసి ,ఇక వారి సక్సెస్ ను చూసి మురిసిపోయాడు.. ఇక అంతా బాగుందన్న సమయంలో   ఒకరోజు హైదరబాద్  నుండి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి స్వయంగా తానే కారు నడుపుతూ కావలి లో జరగబోయే ఒక పెళ్లి కి వెళ్తున్న సమయంలో, ఆగస్టు 29 2018 ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల మధ్య  వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాలో, అన్నెపర్తి వద్ద హైదరాబాద్ -  విజయవాడ హైవే మీద,  కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు కారు పలుసార్లు పల్టీ కొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలైన హరిక్రిష్ణను , నార్కట్ పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది అయితే కారులో ఉన్న మరో ఇద్దరు మాత్రం బతికి బయటపడ్డారు. హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరామ్ కూడా 2014లో నల్గొండకు సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగ‌నంప‌డ‌మా ..? స్వ‌చ్ఛందంగా వెళ్లేలా చేయ‌డ‌మా?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>