MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/awarded-moviescb79c469-f6e8-4d75-89b0-cb7d1abe6717-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/awarded-moviescb79c469-f6e8-4d75-89b0-cb7d1abe6717-415x250-IndiaHerald.jpgద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ న‌టించి అసంఖ్యాక అభిమానుల‌ను సంపాదించుకున్న అతికొద్దిమంది న‌టీమ‌ణుల్లో ముందువ‌రుస‌లో ఉంటారు సీనియ‌ర్ న‌టి కేఆర్ విజ‌య. 1960, 70 ద‌శ‌కాల్లో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా వెలుగొందారామె. ఇక ప‌లు పౌరాణిక, భ‌క్తిర‌స ప్ర‌ధాన చిత్రాల్లో దేవి, దేవ‌త‌ పాత్ర‌ల్లో న‌టించడం ద్వారా ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆ పాత్ర‌ల్లో సాక్షాత్తూ అమ్మ‌వారే దిగివ‌చ్చిన‌ట్టే కేఆర్ విజ‌య క‌నిపించేవారంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు.awarded-movies;ntr;prema;tara;tiru;cinema;telugu;love;nandamuri taraka rama rao;chitramఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..awarded-movies;ntr;prema;tara;tiru;cinema;telugu;love;nandamuri taraka rama rao;chitramWed, 19 May 2021 17:41:22 GMTద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ న‌టించి అసంఖ్యాక అభిమానుల‌ను సంపాదించుకున్న అతికొద్దిమంది న‌టీమ‌ణుల్లో ముందువ‌రుస‌లో ఉంటారు సీనియ‌ర్ న‌టి కేఆర్ విజ‌య. 1960, 70 ద‌శ‌కాల్లో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా వెలుగొందారామె. ఇక ప‌లు పౌరాణిక, భ‌క్తిర‌స ప్ర‌ధాన చిత్రాల్లో దేవి, దేవ‌త‌ పాత్ర‌ల్లో న‌టించడం ద్వారా ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆ పాత్ర‌ల్లో సాక్షాత్తూ అమ్మ‌వారే దిగివ‌చ్చిన‌ట్టే కేఆర్ విజ‌య క‌నిపించేవారంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు. అలాంటి సినిమాల్లో ఆమె క‌న‌బ‌ర‌చిన న‌ట‌న‌కు, ఆమెకే సొంత‌మైన‌ ఆహార్యంకూడా తోడై మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు భ‌క్తిపార‌వ‌శ్యంతో థియేట‌ర్ల‌లో పూన‌కాలు వ‌చ్చేవ‌ని చెపుతారు.కేఆర్ విజ‌య 30 న‌వంబ‌ర్ 1948న కేర‌ళ రాష్ట్రంలోని తిరువ‌నంత‌పురంలో జ‌న్మించారు. ఆమెతండ్రి తెలుగువారే. త‌ల్లి మాత్రం మ‌ల‌యాళీ. ఆమె అస‌లు పేరు దేవ‌నాయ‌కి. 1963లో క‌ర్ప‌గం అనే త‌మిళ చిత్రం ద్వారా 15 ఏళ్ల వ‌య‌సులోనే ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగులో ఆ చిత్రం తోడునీడ‌గా నిర్మిత‌మైంది. సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన రెండేళ్ల‌లోనే రెండు ప‌దుల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు.

1966లో ఎన్టీఆర్ సొంత బ్యానర్‌లో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ శ్రీకృష్ణపాండ‌వీయం చిత్రంలో కేఆర్ విజ‌య రుక్మిణి పాత్ర‌లో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మయ్యారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ తానే తిల‌కం దిద్ది ఆమెను రుక్మిణి పాత్ర‌కు సిద్ధం చేశార‌ని, ఆ మ‌హ‌త్మ్య‌నేమో.. త‌న‌కు ఎక్కువ‌గా దేవ‌త పాత్ర‌లు ల‌భించాయ‌ని అంటారామె.  అప్ప‌ట్లో ద‌క్షిణాదిన దాదాపు అగ్ర‌హీరోలంద‌రితోనూ న‌టించిన ఈ సీనియ‌ర్ న‌టీమ‌ణి, ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న న‌ట‌ప్ర‌యాణాన్ని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో వివిధ పాత్ర‌లు పోషించారు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రెండేళ్ల‌కే 1966లో కేఆర్ విజ‌య‌..ప్ర‌ముఖ‌ వ్యాపార‌వేత్త వేలాయుధ‌న్ నాయ‌ర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె వ‌య‌సు 17 ఏళ్లే. వేలాయుధ‌న్‌కు హోట‌ళ్లు, సినీ నిర్మాణం వంటి ప‌లువ్యాపారాలుండేవి. అప్ప‌ట్లోనే సొంత విమాన‌మూ ఉండేద‌ట‌. దాదాపు 60కి పైగా చిత్రాలను ఆయ‌న నిర్మించారు. అప్ప‌ట్లో వీరి వివాహం ఇండస్ట్రీలో సంచ‌ల‌న వార్త‌గా మారింద‌ని చెపుతారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>