MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanta29ffb575-e3aa-4b0f-9d4e-40184db03d81-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanta29ffb575-e3aa-4b0f-9d4e-40184db03d81-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో సమంత అక్కినేని కూడా ఒకరు. తనదైన నటనతో సమంత అందరినీ మెప్పించారు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. వరుస సినిమాలతో తనేంటో నిరూపించుకున్న సమంత తన నటనతో టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రస్తుతం దేశంలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి నటీనటు..samanta;abinaya;nageshwara rao akkineni;raj;sam;samantha;tollywood;cinema;interview;girl;sam mendes;santosham;anandamతన పాత్ర గురించి చెప్పేసిన సామ్..తన పాత్ర గురించి చెప్పేసిన సామ్..samanta;abinaya;nageshwara rao akkineni;raj;sam;samantha;tollywood;cinema;interview;girl;sam mendes;santosham;anandamWed, 19 May 2021 11:30:05 GMTటాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో సమంత అక్కినేని కూడా ఒకరు. తనదైన నటనతో సమంత అందరినీ మెప్పించారు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. వరుస సినిమాలతో తనేంటో నిరూపించుకున్న సమంత తన నటనతో టాలీవుడ్ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రస్తుతం దేశంలో వెబ్ సిరీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి నటీనటులు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నో వెబ్ సిరీస్‌లు అభిమానులను అలరించాయి. వాటిలో మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి.
 

 ఈ వెబ్ సిరీస్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. దాంతో దర్శకనిర్మాతలు దానికి సీక్వెల్ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దీని సీక్వెల్‌గా వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్2. ఇందులో అక్కినేని సమంత ఓ కీలక పాత్రలో నటించారు.ఇందులో రాజీ అనే అమ్మాయి పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ సిరీస్ టీమ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో సమంత తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు.



ఇటువంటి అద్భత పాత్రకు తనను ఎంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సమంత చెప్పారు. ‘దేశంలో ఎందరో నటీనటులు ఇటువంటి పాత్రల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే రాజ్ అండ్ డీకే కేవలం ముంబయిలోనే కాకుండా ఇతర భాషల వారికి అవకాశాలు ఇస్తున్నందుకు, అందులోనూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో రాజీ పాత్ర చాలా బాగా రాశారు. దాంతో ఈ పాత్రలో నేను బాగా నటించ గలిగాను. ఈ సిరీస్‌లో రాజీ పాత్ర ఎటువంటి సైడ్స్ తీసుకోకుండా, తన సొంత తరహాలో ఉంది. అందువల్లే పాత్ర చాలా బాగా కుదిరింది. నేను చేస్తున్న తొలి నెగిటివ్ పాత్ర ఇదే. దాంతో కాస్త ఛాలెంజ్‌గా అనిపించింది. రాజ్ అండ్ డీకేతో కలిసి పని చేయడం ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇందులో చేయడం చాలా ఆనందంగా ఉంద’ని సమంత చెప్పుకొచ్చింది.

 

ఇదిలా ఉంటే  ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌ కోసం  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండో భాగం కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందేమో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్...!

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>