PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/prisoners-bail-ap-high-court-corona-effect-on-jails-f7a94d6e-9384-447f-bf72-7f8418a08b2e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/prisoners-bail-ap-high-court-corona-effect-on-jails-f7a94d6e-9384-447f-bf72-7f8418a08b2e-415x250-IndiaHerald.jpgజైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పరోక్షంగా కలిసొచ్చింది. జైళ్లలో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉండటంతో.. మధ్యంతర బెయిల్ తో ఖైదీలను ఇళ్లకు పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే సుప్రీంకోర్టు ఈ దిశగా ఆదేశాలిచ్చింది. గతంలో కొంతమంది అర్హులైన ఖైదీలు విడుదలైనప్పటికీ, ఆ సంఖ్య చాలా స్వల్పం. ఇప్పుడు సెకండ్ వేవ్ లో జైళ్లలో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉండటంతో.. ఏపీ హై కోర్టు పలు కీలక సూచనలు చేసింది. prisoners bail, ap high court, corona effect on jails,;amala akkineni;andhra pradesh;courtఖైదీలకు అలా కలిసొచ్చిన కరోనా..ఖైదీలకు అలా కలిసొచ్చిన కరోనా..prisoners bail, ap high court, corona effect on jails,;amala akkineni;andhra pradesh;courtWed, 19 May 2021 08:00:00 GMTజైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా పరోక్షంగా కలిసొచ్చింది. జైళ్లలో కరోనా కేసులు పెరిగిపోయే అవకాశం ఉండటంతో.. మధ్యంతర బెయిల్ తో ఖైదీలను ఇళ్లకు పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే సుప్రీంకోర్టు ఈ దిశగా ఆదేశాలిచ్చింది. గతంలో కొంతమంది అర్హులైన ఖైదీలు విడుదలైనప్పటికీ, ఆ సంఖ్య చాలా స్వల్పం. ఇప్పుడు సెకండ్ వేవ్ లో జైళ్లలో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉండటంతో.. ఏపీ హై కోర్టు పలు కీలక సూచనలు చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రిమాండ్ లో ఉన్న ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడిన ఖైదీలు, ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష విధించే నేరాలకు పాల్పడిన విచారణ ఖైదీలను మధ్యంతర బెయిలు ద్వారా విడుదల చేయాలని పేర్కొంది. వారికి 90 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈనెల 7న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో హైకోర్టు ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ ఏపీలో 643మంది ఖైదీలకు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని, ఇంకా 6వేలమందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని, జైళ్ల శాఖ డీజీ తెలిపారు.

హైపవర్ కమిటీ తీర్మానాలివే..
- గతేడాది కరోనా కారణంగా హైపవర్‌ కమిటీ తీర్మానాలతో విడుదలై సకాలంలో జైలుకి తిరిగొచ్చిన ఖైదీలు/విచారణ ఖైదీలను ఈసారి కూడా విడుదల చేయాలి. బెయిల్ పై వెళ్లి సకాలంలో జైలుకు తిరిగి వచ్చినవారే ఇందుకు అర్హులు.
- ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష విధించేందుకు వీలున్న నేరాలకు పాల్పడినవారి అరెస్ట్‌ విషయంలో ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.
- సుప్రీం ఉత్తర్వులు అమలు చేయడంలో విఫలమైతే, పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు, కోర్టుధిక్కరణ చర్యలు.
- జైలు నుంచి బెయిలుపై వెళ్లాక 14 రోజులు హోం క్వారంటైన్‌ లో ఉంటామని ఖైదీలు హామీ ఇవ్వాలి. షరతులను ఉల్లంఘిస్తే బెయిలు రద్దుచేసి, తక్షణం కస్టడీలోకి తీసుకుంటారు.
- ఈనెల 27న పరిస్థితి సమీక్షించేందుకు మరోసారి హైపవర్ కమిటీ సమావేశం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూడాన్ కూడా భారత్ పై నిషేధం ?

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>