PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-high-court-ap-govt-covid-hospitals-8b7c245e-870c-41b6-bddc-6195a38797cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-high-court-ap-govt-covid-hospitals-8b7c245e-870c-41b6-bddc-6195a38797cd-415x250-IndiaHerald.jpgకొవిడ్ కల్లోలంలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రులన్నిటినీ గోవా ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు తమ ఆదేశాలు పాటించలేదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. విపత్తుల సమయంలో కొన్ని ఇతర దేశాల్లో కూడా ప్రభుత్వాలు వైద్యాన్ని పూర్తిగా తమ చేతిలోకి తీసుకునే ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు కీలక సూచన చేసింది. అలా చేస్తే.. మరికొందరు బాధితులకైనా ప్రభుత్వ పరిap high court, ap govt, covid hospitals,;goa;andhra pradesh;local language;central government;arogyasriఏపీలో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులు..?ఏపీలో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులు..?ap high court, ap govt, covid hospitals,;goa;andhra pradesh;local language;central government;arogyasriTue, 18 May 2021 08:00:00 GMTకొవిడ్ కల్లోలంలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రులన్నిటినీ గోవా ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు తమ ఆదేశాలు పాటించలేదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. విపత్తుల సమయంలో కొన్ని ఇతర దేశాల్లో కూడా ప్రభుత్వాలు వైద్యాన్ని పూర్తిగా తమ చేతిలోకి తీసుకునే ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు కీలక సూచన చేసింది. అలా చేస్తే.. మరికొందరు బాధితులకైనా ప్రభుత్వ పరిధిలో చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపింది.

కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కొంతమంది దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఆ అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించింది. రోగులు, వారి బంధువులు ఆసుపత్రుల చుట్టూ తిరిగే ఇబ్బందిని అధిగమించడానికి  ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలంది. టీకా వేసే సమయంలో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కట్టడిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఎవరు ఔనన్నా, కాదన్నా.. ఏపీతో సహా దేశవ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా కల్లోలాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఏపీలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతోపాటు, గరిష్ట ఫీజును నిర్ణయించడం కొంతలో కొంత మేలు. అయితే అనధికారికంగా కరోనా బాధితుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయం మాత్రం వాస్తవం. ఇలాంటి ఇబ్బందిని అధిగమించాలంటే ప్రైవేటు ఆస్పత్రుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కరోనా కల్లోలం సమసిపోయే వరకు వాటిని తామే నిర్వహించడం ఒక్కటే ప్రత్యామ్నాయం అని కొంతమంది వాదిస్తున్నారు. ఇతర దేశాలను ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే విషయాన్ని పరిశీలించాలంటూ  హైకోర్టు, ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేయడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాడులు చేయండి కానీ.. అది మాత్రం వద్దు : బైడెన్

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>