EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghu-rama-krishnam-raju-assets03f65237-b918-4877-a3b8-d710ca725ec3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghu-rama-krishnam-raju-assets03f65237-b918-4877-a3b8-d710ca725ec3-415x250-IndiaHerald.jpgఘురామ అరెస్టు వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక ఎంపీ స్థాయి వ్య‌క్తిని సీఐడీ అధికారులు కొట్టార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో సుప్రీంకోర్టుసైతం కేసును సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేసు వ్య‌వ‌హారం వైసీపీ ప్ర‌భుత్వానికి లాభిస్తుందా.. ర‌ఘురామ‌కు లాభిస్తుందా అన్న చ‌ర్చ ఏపీలో సాగుతుంది. ఆర్మీ ఆస్ప‌త్రి వైద్య బృందం ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను హైకోర్టు ద్వారా ఈనెల 21న ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితి, వీడియోగ్ర‌ఫీ, స్టేట్‌మెంట్‌ను షీల్డ్ క‌వ‌ర్‌లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయ‌ధికారికి అందించ‌నుraghu rama krishnam raju assets;tiru;andhra pradesh;telangana;mp;high court;police;court;army;shield;ycpర‌ఘురామ కేసులో ట్విస్ట్ లు.. ఎవ‌రికి అనుకూలిస్తాయి!ర‌ఘురామ కేసులో ట్విస్ట్ లు.. ఎవ‌రికి అనుకూలిస్తాయి!raghu rama krishnam raju assets;tiru;andhra pradesh;telangana;mp;high court;police;court;army;shield;ycpTue, 18 May 2021 14:39:00 GMTఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అరెస్టు వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. సుప్రింకోర్టు చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఐడీ పోలీసులు ద‌ర్యాప్తు సంద‌ర్భంలో కొట్టార‌ని హైకోర్టు ఎదుట ర‌ఘురామ వాపోయాడు. దీంతో వైద్య ప‌రీక్ష‌ల‌కు ఆదేశించ‌డంతో.. వైద్య ప‌రీక్ష‌ల్లో కొట్టిన దెబ్బ‌లు కాద‌ని తేలింది. సుప్రీంకోర్టుకు వెళ్లేస‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశించింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం  హైకోర్టు నియ‌మించిన జ్యుడీషియ‌ల్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆర్మీ ఆస్ప‌త్రిలో ముగ్గురు వైద్య సిబ్బంది ర‌ఘురామ‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

ర‌ఘురామ అరెస్టు వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక ఎంపీ స్థాయి వ్య‌క్తిని సీఐడీ అధికారులు కొట్టార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో సుప్రీంకోర్టుసైతం కేసును సీరియ‌స్‌గా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేసు వ్య‌వ‌హారం వైసీపీ ప్ర‌భుత్వానికి లాభిస్తుందా.. ర‌ఘురామ‌కు లాభిస్తుందా అన్న చ‌ర్చ ఏపీలో సాగుతుంది. ఆర్మీ ఆస్ప‌త్రి వైద్య బృందం ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను హైకోర్టు ద్వారా ఈనెల 21న ర‌ఘురామ ఆరోగ్య ప‌రిస్థితి, వీడియోగ్ర‌ఫీ, స్టేట్‌మెంట్‌ను షీల్డ్ క‌వ‌ర్‌లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయ‌ధికారికి అందించ‌నున్నారు. ఈ నివేదిక‌లో ర‌ఘురామ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు కొట్టార‌ని తేలితే తీవ్ర ప‌రిణామాలు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. సీఐడీ అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లకుసైతం సుప్రీంకోర్టు ఆదేశించే ప‌రిస్థితులు ఉన్నాయి. ఇదే జ‌రిగితే ఏపీ ప్ర‌భుత్వంపై ర‌ఘురామ రాజు ఒక‌విధంగా పైచేయి సాధించిన‌ట్లే.

ర‌ఘురామ‌ను సీఐడీ అధికారులు కొట్ట‌లేద‌ని, ఆయ‌నే కావాల‌ని అబ‌ద్దాలు చెప్పాడ‌ని తేలితే అది జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతుంద‌ని ప‌లువురు న్యాయ‌నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా  కేసు ఎటు మ‌లుపు తిరుగుతుందో స్ప‌ష్ట‌త రానుంది. అయితే కేసు విచార‌ణ తేదీ వ‌ర‌కు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న ఎంపీని ఎవ‌రు క‌ల‌వ‌డానికి వీలులేదు. అప్ప‌టి వ‌ర‌కు మిల‌ట‌రీ ఆస్ప‌త్రిలోనే వైద్య  చికిత్స‌లు అందించ‌నున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇస్తారు. మొత్తానికి ర‌ఘురామ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హారంలో ఎవ‌రిది పైచేయి అవుతుందోన‌న్న చ‌ర్చ ఏపీ ప్ర‌జ‌ల్లో సాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినిమా కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన 'నేనింతే' సినిమాకి ఎన్ని అవార్డులో..?

చిరంజీవి అక్క గా నటించిన ఈ నటిని గుర్తు పట్టారా..?

దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>