PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gantaa31da1024-2107-4889-8ccf-7fbdbf744a65-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gantaa31da1024-2107-4889-8ccf-7fbdbf744a65-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో తాజా కొంత సేపే. మాజీ అన్నదే శాశ్వతంగా ఉంటుంది. ఎంతో కష్టపడి సాధించిన పదవి కూడా ఏదో నాడు ఊడిపోయేదే. ఆ మాటకు వస్తే పదవులు ఎలా పోతాయో కూడా ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆవేశం కూడా పదవులను మింగేస్తుంటుంది. gantaa;tara;2019;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;hero;tdp;central government;ycp;tammineni seetha ramవైసీపీకి గంటా మార్క్ షాక్... ?వైసీపీకి గంటా మార్క్ షాక్... ?gantaa;tara;2019;రాజీనామా;vishakapatnam;assembly;mla;minister;hero;tdp;central government;ycp;tammineni seetha ramTue, 18 May 2021 19:00:00 GMTరాజకీయాల్లో తాజా కొంత సేపే. మాజీ అన్నదే శాశ్వతంగా ఉంటుంది. ఎంతో కష్టపడి సాధించిన పదవి కూడా ఏదో నాడు ఊడిపోయేదే. ఆ మాటకు వస్తే పదవులు ఎలా పోతాయో కూడా ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆవేశం కూడా పదవులను మింగేస్తుంటుంది.

విషయానికి వస్తే విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచారు. ఆయన గత రెండేళ్ళుగా రాజకీయంగా పెద్దగా చురుకుగా ఉండడంలేదు. అదే సమయంలో ఆయన అటు అధికార పార్టీని కూడా పెద్దగా విమర్శించడంలేదు. ఇవన్నీ ఇలా ఉంటే మూడు నెలల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తారు అన్న వార్తలు రావడంతోనే గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆయన తన రాజీనామా విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారనే చెప్పాలి. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వద్దకు వెళ్ళి తన రాజీనామా గురించి చెప్పి ఆమోదించాలని కోరారు. ఇది జరిగి కూడా చాలా రోజులు అయింది. ఇక‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న జరగనున్నాయి. దాంతో గంటా రాజీనామా అంశం మళ్లీ చర్చకు వస్తోంది.

ఆయన నేరుగా అసెంబ్లీలోనే దీని మీద తేల్చుకుంటారు అంటున్నారు. ఆయన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేత తీర్మానానికి   పట్టుబట్టి మరీ తన రాజీనామాను ఆమోదించుకుంటారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి గంటా రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.  గంటా రాజీనామాను ఆమోదిస్తే ఆయన హీరో అవుతారు. ఆ మీదట వైసీపీ ఎమ్మెల్యేల మీద కూడా రాజీనామా వత్తిడి ఉంటుంది. మరో వైపు స్టీల్ ప్రైవేటీకరణ మీద కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దాంతో ఎలా చూసుకున్నా గంటా రాజీనామా అన్నది వైసీపీ సర్కార్ కి ఇరకాటమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మార్పు పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం !

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>