PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-country6fb8bc9e-7246-410e-b4a1-09bfc61774c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-country6fb8bc9e-7246-410e-b4a1-09bfc61774c2-415x250-IndiaHerald.jpgచైనా జనాభా లెక్కలు చూస్తుంటే ఆడపిల్లలు కట్నం ఇచ్చే రోజులు పోయి ఎదురు కట్నం తీసుకునే రోజులు మొదలయ్యాయి అనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టగానే అమ్మో అనుకునే రోజులు పోయాయి. హమ్మయ్య అనుకొనే రోజులు రాబోతున్నట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది.CHINA COUNTRY;samatha;marriage;population;girl;118;ee rojulloఅమ్మాయిల కొరత ... 111 మందికి 100 మంది అమ్మాయిలే ?అమ్మాయిల కొరత ... 111 మందికి 100 మంది అమ్మాయిలే ?CHINA COUNTRY;samatha;marriage;population;girl;118;ee rojulloTue, 18 May 2021 15:00:00 GMTచైనా జనాభా లెక్కలు చూస్తుంటే ఆడపిల్లలు కట్నం ఇచ్చే రోజులు పోయి ఎదురు కట్నం తీసుకునే రోజులు మొదలయ్యాయి అనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టగానే అమ్మో అనుకునే రోజులు పోయాయి. హమ్మయ్య అనుకొనే రోజులు రాబోతున్నట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన దేశంగా పేరుగాంచిన చైనా లో నేడు ఆడ పిల్లలు కరువయ్యారు. తద్వారా దాదాపు మూడు కోట్ల వరకు పురుషుల బ్రహ్మచారులుగా మిగిలిపోయారు. వివరాల్లోకి వెళితే తాజాగా డ్రాగన్ దేశం తమ దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల గణాంకాలు జరుపగా అందులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

2021 మే 11వ తేదీన చైనా తమ దేశ జనాభా లెక్కలను విడుదల చేయగా..ఆ గణాంకాల నివేదిక ప్రకారం దేశంలో ఎక్కువమంది పెళ్లికాని పురుషులు ఉన్నట్లు  తేలింది. దాదాపు 30 మిలియన్ల మంది పురుషులు పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోయారని ఈ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనాలో  111.3 మంది పురుషులకు 100 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని ఈ సర్వేలో బయటపడింది. పోయిన ఏడాది 2010లో 118.1 పురుషులకు వంద మంది అమ్మాయిలు ఉండగా ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. గత జనాభా లెక్కలతో పోలిస్తే ఈసారి ఆడపిల్లల సంఖ్య కాస్త పెరిగినప్పటికీ ఇంకా ఆడపిల్లల కొరత అలాగే ఉంది.

దీనికి  కారణం చైనా విధాన ప్రభావం అని, లింగ సమతుల్యతను పాటించకపోవడం  ప్రధాన కారణమని మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఏడాది కైనా పురుషులు మరియు అమ్మాయిల నిష్పత్తి సమానంగా ఉండడానికి చైనా ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. కాలం ఎంతగానో మార్పు చెందిన ఈ రోజుల్లో కూడా ఆడ పిల్లలు పుడితే బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికైనా అలాంటి వారు ఆడపిల్లలు భారం కాదు బాధ్యత అన్న విషయాన్ని  గ్రహించి అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా సమానంగా పెంచాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినిమా కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన 'నేనింతే' సినిమాకి ఎన్ని అవార్డులో..?

చిరంజీవి అక్క గా నటించిన ఈ నటిని గుర్తు పట్టారా..?

దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>