PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19-ts-newsc05bda01-5601-4204-aea6-03c04e133205-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19-ts-newsc05bda01-5601-4204-aea6-03c04e133205-415x250-IndiaHerald.jpgదేశంలో టీకా కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టిన త‌రువాత‌ ఏప్రిల్ 3 నాటికి 7.50కోట్ల టీకా డోస్‌లు ఇవ్వ‌గా వీటిలో 6.86 కోట్ల‌కు పైగా కొవిషీల్డ్, 67ల‌క్ష‌ల‌కు పైగా కొవాగ్జిన్ టీకాను అందించిన‌ట్లు క‌మిటీ పేర్కొంది. వీటిలో 23వేల‌కుపైగా దుష్ప్ర‌భావ ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి. దేశంలో 753 జిల్లాల‌కు గాను 684 జిల్లాల్లో ఇవి వెలుగు చూశాయి. అయితే 23వేల కేసుల్లో 700 కేసులు మాత్ర‌మే తీవ్ర‌మైన‌విగా ఏఈఎఫ్ఐ గుర్తించింది. 498 సీరియ‌స్ కేసుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌గా అనుమానిత థ్రాంబోఎంబోలిక్ స‌మ‌స్య 26 కేసుల్లో ఉత్ప‌నCOVID-19, ts news;central governmentకొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?COVID-19, ts news;central governmentTue, 18 May 2021 09:36:00 GMTదేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతోంది. వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ఆస్ప‌త్రుల బాట ప‌డుతుండ‌గా, వేలాది మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కొవిడ్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించ‌గా.. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. వ్యాక్సిన్ తీసుకొనేందుకు ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. దేశంలో రెండు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్ , కోవాగ్జిన్ టీకాల‌ను ఇస్తున్నారు. అయితే కొవిషీల్డ్ టీకా తీసుకున్న‌వారిలో ప‌లు దుష్ప్ర‌భావాలు వెలుగులోకి వ‌చ్చాయి. వీటిలో ప్ర‌ధానంగా ర‌క్తస్రావం, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం వంటివి చోటు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. నిజ‌నిర్ధార‌ణ కోసం ప్ర‌భుత్వం ఏఈఎఫ్ఐ క‌మిటీ నియ‌మించింది. ఈ క‌మిటీ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది.

దేశంలో టీకా కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టిన త‌రువాత‌ ఏప్రిల్ 3 నాటికి 7.50కోట్ల టీకా డోస్‌లు ఇవ్వ‌గా వీటిలో 6.86 కోట్ల‌కు పైగా కొవిషీల్డ్, 67ల‌క్ష‌ల‌కు పైగా కొవాగ్జిన్ టీకాను అందించిన‌ట్లు క‌మిటీ పేర్కొంది. వీటిలో 23వేల‌కుపైగా దుష్ప్ర‌భావ ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి. దేశంలో 753 జిల్లాల‌కు గాను 684 జిల్లాల్లో ఇవి వెలుగు చూశాయి. అయితే 23వేల కేసుల్లో 700 కేసులు మాత్ర‌మే తీవ్ర‌మైన‌విగా ఏఈఎఫ్ఐ గుర్తించింది. 498 సీరియ‌స్ కేసుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌గా అనుమానిత థ్రాంబోఎంబోలిక్ స‌మ‌స్య 26 కేసుల్లో ఉత్ప‌న్న‌మైన‌ట్లు గుర్తించారు. అయితే 10ల‌క్ష‌ల డోస్‌ల‌లో కేవ‌లం 0.61 కేసుల్లో మాత్ర‌మే ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొంది.

ఇదిలాఉంటే కొవిషీల్డ్ టీకా తీసుకున్న త‌రువాత 20 రోజుల లోపు అనుమానిత థ్రాంబో ఎంబోలిక్ ల‌క్ష‌ణాలు త‌లెత్తితే, వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ ఆరోగ్య సిబ్బందికి, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇప్ప‌టికే ఆరోగ్య‌శాఖ సూచ‌న‌లు చేసిన విష‌యం విధిత‌మే. వీటిలో ముఖ్యంగా శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, కాళ్లు , చేతుల్లో నొప్పి, వాపు, ఇంజెక్ష‌న్ చేసిన ప్రాంతానికి చేరువ‌లో ఎర్ర‌టి మ‌చ్చ‌లు, చ‌ర్మం క‌మిలిన‌ట్లు మార‌డం, క‌డుపులో నొప్పి వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని, ఇవి క‌నిపిస్తే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని ఇప్ప‌టికే కేంద్రం సూచించింది. ఇదిలా ఉంటే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కొవిడ్ ఇన్‌ఫెక్ష‌న్‌పై బ‌లంగా పోరాడుతుంద‌ని, మ‌ర‌ణాలు త‌గ్గించే శ‌క్తి దీనిలో ఉంద‌ని ఏఈఎఫ్ఐ క‌మిటీ స్ప‌ష్టం చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిఎంలను దగ్గర చేసుకోవడానికి మోడీ నానా కష్టాలు...?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>