MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-mahesh-bounce-back-with-dhookudue0f07a5d-1d1a-44fb-bfe4-07bc3617ae58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-star-mahesh-bounce-back-with-dhookudue0f07a5d-1d1a-44fb-bfe4-07bc3617ae58-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ తీసిన తీసిన పోకిరి సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అయితే ఆ తరువాత గుణశేఖర్ తీసిన సైనికుడు మూవీ తో భారీ పరాజయాన్ని చవిచూసిన మహేష్, అనంతరం సురేందర్ రెడ్డి తీసిన అతిధి మూవీ తో కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ఆపై మూడేళ్ళ అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖలేజా మూవీ చేసిన మహేష్, దానితో కూడా భారీ ఫెయిల్యూర్ ని అందుకున్నారు. అనంతరం కొంత ఆలోచన చేసిన మహేష్, తన నెక్స్ట్ సినిమానిAwarded-movies;mahesh;prakash raj;ram gopal varma;sonu sood;ajay;anil music;anil sunkara;geetha;gunasekhar;puri jagannadh;raj;ram pothineni;samantha;srinu vytla;surender reddy;thaman s;trivikram srinivas;vijay;andhra pradesh;tollywood;cinema;sangeetha;rajani kanth;sunkara ramabrahmam;industry;blockbuster hit;comedian;heroine;traffic police;joseph vijay;father;athidhi;pokiri;reddy;master;khalejaదూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!Awarded-movies;mahesh;prakash raj;ram gopal varma;sonu sood;ajay;anil music;anil sunkara;geetha;gunasekhar;puri jagannadh;raj;ram pothineni;samantha;srinu vytla;surender reddy;thaman s;trivikram srinivas;vijay;andhra pradesh;tollywood;cinema;sangeetha;rajani kanth;sunkara ramabrahmam;industry;blockbuster hit;comedian;heroine;traffic police;joseph vijay;father;athidhi;pokiri;reddy;master;khalejaTue, 18 May 2021 14:30:35 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ తీసిన తీసిన పోకిరి సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అయితే ఆ తరువాత గుణశేఖర్ తీసిన సైనికుడు మూవీ తో భారీ పరాజయాన్ని చవిచూసిన మహేష్, అనంతరం సురేందర్ రెడ్డి తీసిన అతిధి మూవీ తో కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. ఆపై మూడేళ్ళ అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖలేజా మూవీ చేసిన మహేష్, దానితో కూడా భారీ ఫెయిల్యూర్ ని అందుకున్నారు. అనంతరం కొంత ఆలోచన చేసిన మహేష్, తన నెక్స్ట్ సినిమాని శ్రీనువైట్ల తో చేయడానికి సిద్దమయ్యారు.

ఆ విధంగా వారిద్దరి కలయికలో రూపొందిన మూవీనే దూకుడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రిలీజ్ తరువాత ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని మరొక్కసారి సూపర్ స్టార్ కలెక్షన్స్ స్టామినా ని టాలీవుడ్ కి రుజువు చేసింది. ఈ సినిమాని మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు శ్రీనువైట్ల. ప్రకాష్ రాజ్ మహేష్ తండ్రిగా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సోను సూద్ విలన్ పాత్ర చేసారు.

తన తండ్రి ప్రాణాలను కాపాడేందుకు తపన పడే అజయ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మహేష్ నటనకు ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పలికారు. ఇక ఈ సినిమా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డ్స్ లో ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఉత్తమ నటుడిగా మహేష్, ఉత్తమ కమెడియన్ గా ఎమ్ ఎస్ నారాయణ, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల, ఉత్తమ ఫైట్ మాస్టర్ గా విజయ్, అలానే ఈ మూవీ ఉత్తమ ఫీచర్ ఫిలిం గా, ఉత్తమ ఎడిటర్ గా ఎమ్ ఆర్ వర్మ అవార్డులు సొంతం చేసుకున్నారు.ఆ  విధంగా దూకుడు మూవీ మహేష్ కెరీర్ లో ఒక సెన్సేషనల్ మూవీ అని చెప్పవచ్చు .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>