PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/praivate1c3535a6-5b38-419e-8d77-85d00336abd5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/praivate1c3535a6-5b38-419e-8d77-85d00336abd5-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అంతా ప్రైవేట్ మయం. విద్య, వైద్యం అంతా కూడా ప్రైవేట్ కి దాసోహం అంటోంది. ప్రైవేటు అసుపత్రుల తీరు చూస్తే ఏ చిన్న జబ్బు వచ్చిన లక్షలు వదిలించుకోవాల్సిందే. ఇపుడు కరోనా కాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. praivate;vidya;jagan;ycp;nijamప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో కఠిన నిర్ణయం.... ?ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో కఠిన నిర్ణయం.... ?praivate;vidya;jagan;ycp;nijamTue, 18 May 2021 20:00:00 GMTరాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అంతా ప్రైవేట్ మయం. విద్య, వైద్యం అంతా కూడా ప్రైవేట్ కి దాసోహం అంటోంది. ప్రైవేటు అసుపత్రుల తీరు చూస్తే  ఏ చిన్న జబ్బు వచ్చిన లక్షలు వదిలించుకోవాల్సిందే. ఇపుడు కరోనా కాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి కధలు కధలుగా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా పేరిట లక్షల్లో బిల్లు వసూలు చేస్తూ ప్రజలని బతికుండగానే శవాలుగా మార్చేస్తున్నాయి అన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. కరోనా కు నిజంగా చూస్తే మందు లేదు. అయినా కూడా ఈ రోజున ప్రపంచంలో అత్యధిక ఖరీదైన  వైద్యం దీనికే అవుతోంది. ఎందుకు అంటే ఇది ఒక దందాలా  తయారైంది.

కరోనా పేషంట్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడమే లకారంతో మొదలుపెట్టి బతికి బయటకు వస్తే చేతికి చిప్ప అన్నట్లుగా రోగికి  సీన్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ అన్నీ ఖరీదే. అన్నీ అధిక ధరలే. జనాల భయాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో కరోనా కట్టడి విషయంలో వరస నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది అంటున్నారు.

ఏపీలో కరోనా విషయంలో హై కోర్టు కూడా విచారణ చేస్తోంది. ప్రభుత్వానికి ఈ మేరకు సూచించింది కూడా. పేదలను జలగల్లా పీడిస్తున్నా ప్రైవేట్ యాజమాన్యాల విషయంలో కఠినంగా ఉండాలంటే ప్రభుత్వానికి ఇంతకంటే మరో మార్గం లేదు అంటున్నారు. దీంతో తొందరలోనే ఈ నిర్ణయం వైపుగా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తుంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. అదే విధంగా బెడ్స్ కి ఇతర వాటికి కూడా లోటు తీరుతుంది. అలాగే పేదలకు, మధ్యతరగతి వర్గాలకు కూడా  కరోనా వైద్యం విషయంలో న్యాయం జరుగుతుంది అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మార్పు పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం !

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>