MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/sridevi-sanjaydutta9605d1c-7254-42b4-b4d1-7eb19e419dbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/sridevi-sanjaydutta9605d1c-7254-42b4-b4d1-7eb19e419dbc-415x250-IndiaHerald.jpgఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన అద్భుత న‌టి శ్రీదేవి. ఈమె హ‌ఠాన్మ‌ర‌ణం సినీ ప్రియులు ఇప్పటికీ జీర్ణించుకోలేనిదే. ద‌క్షిణాదినుంచి వెళ్లి ఉత్త‌రాదిన నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు హిమ్మ‌త్‌వాలా చిత్రంతో ఆమెను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశాడు. ఇక ఆ త‌రువాత ఆమె వెనుదిరిగి చూసిందే లేదు. అందంలోను, అభిన‌యంలోనూ ఆమెకెవ‌రూ సాటిరాలేర‌ని సినీ పండితులు ఎప్పుడో తేల్చేశారు.Sridevi-sanjaydutt;alia bhatt;sonakshi sinha;sridevi kapoor;cinema;marriage;v;chitramశ్రీదేవి మ‌ర‌ణంతో ఆగిపోయిన సినిమా..?శ్రీదేవి మ‌ర‌ణంతో ఆగిపోయిన సినిమా..?Sridevi-sanjaydutt;alia bhatt;sonakshi sinha;sridevi kapoor;cinema;marriage;v;chitramTue, 18 May 2021 07:00:00 GMTఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన అద్భుత న‌టి శ్రీదేవి. ఈమె హ‌ఠాన్మ‌ర‌ణం సినీ ప్రియులు ఇప్పటికీ జీర్ణించుకోలేనిదే. ద‌క్షిణాదినుంచి వెళ్లి ఉత్త‌రాదిన నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు "హిమ్మ‌త్‌వాలా" చిత్రంతో ఆమెను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశాడు. ఇక ఆ త‌రువాత ఆమె వెనుదిరిగి చూసిందే లేదు. అందంలోను, అభిన‌యంలోనూ ఆమెకెవ‌రూ సాటిరాలేర‌ని సినీ పండితులు ఎప్పుడో తేల్చేశారు. బోనీకపూర్‌ను పెళ్లి చేసుకుని వెండితెర‌కు గుడ్‌బై చెప్పేసిన‌ శ్రీదేవి మ‌ళ్ళీ ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో  రీ ఎంట్రీ ఇచ్చి మ‌రోసారి త‌న న‌ట‌నా వైదుష్య‌మేమిటో చాటిచెప్పింది. చివ‌రి రోజుల్లో ఆమె నటించిన 300వ చిత్రం ‘మామ్‌’ లో అస‌మాన న‌ట‌న‌తో  శ్రీదేవి సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. త‌న స్థానాన్ని స‌మీప భ‌విష్య‌త్తులోనూ ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని నిరూపించుకుంది.

అయితే శ్రీదేవి ఊహించ‌నివిధంగా 2018 ఫిబ్ర‌వ‌రిలో అనుమానాస్ప‌దంగా చ‌నిపోవ‌డంతో ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందాల్సిన చిత్రం ఆగిపోయింద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు.  శ్రీదేవి చ‌నిపోవ‌డానికి ముందు ఆరునెల‌ల క్రితం సంజ‌య్‌ద‌త్‌తో శ్రీదేవి క‌లిసి ఓ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత శ్రీదేవి, సంజయ్‌ దత్‌ వెండితెరపై కలిసి మెరవబోతున్నార‌న్న వార్త‌లు అప్ప‌ట్లో బాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తించాయి.. నిజానికి ఎప్పుడో 1993లో వచ్చిన ‘గుమ్రా’ చిత్రంలో జంట‌గా నటించారు సంజయ్‌దత్‌, శ్రీదేవి. ఆ త‌రువాత చాన్నాళ్ల త‌రువాత  కరణ్‌జోహార్‌, సాజిద్‌ నదియాద్‌వాలా కాంబినేషన్‌లో రూపొంద‌నున్న చిత్రంలో వీరిద్దరూ మరోసారి జోడీ కట్టబోతున్నట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది.  ఈ చిత్రంలో న‌టించేందుకు శ్రీదేవి కూడా ఒప్పుకున్నారట. ఆలియా భట్‌, సోనాక్షి సిన్హా, వరుణ్‌ ధావన్‌లు ఈ చిత్రంలో న‌టించ‌నున్నార‌ని,  సంజయ్‌ దత్ అప్ప‌ట్లో ప‌నిచేస్తున్న‌ ‘భూమి’ చిత్రం త‌రువాత ఈ చిత్రం సెట్స్‌కి వెళ్ల‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగింది. అయితే అదే స‌మ‌యంలో శ్రీదేవి అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచి లోకాన్ని వీడ‌టంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాడులు చేయండి కానీ.. అది మాత్రం వద్దు : బైడెన్

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>