PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusf8c41d44-6eaa-4641-b973-43a7038bc228-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusf8c41d44-6eaa-4641-b973-43a7038bc228-415x250-IndiaHerald.jpgవైరస్, బ్యాక్టీరియాలు... కంటికి కూడా కనిపించని స్థాయిలో ఉండే ఈ సూక్ష్మ జీవాలు ఇప్పుడు మనిషిని వణికిస్తున్నాయి. హడలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ అనే ఓ చిన్న జీవి ధాటికి ఇప్పుడు ప్రపంచమే తలకిందులవుతోంది. దాన్ని కట్టడి చేసేందుకు రెండేళ్లుగా కిందా మీదా పడుతోంది. అలాంటి వైరస్, బ్యాక్టీరియాల కట్టడి విషయంలో తాజాగా ఓ మందుడుగు పడింది. అసలు రోగానికి కారణమైన వైరస్, బ్యాక్టీరియాలను గుర్తించడంతోనే వాటిపై గెలుపుకు బీజం పడుతుంది. ప్రస్తుతం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్తే అది వైరస్‌ వల్లనా, బ్యాక్టీరియాcoronavirus;mandula;bengaluru 1;coronavirusగుడ్‌న్యూస్ : వైరస్‌, బ్యాక్టీరియాల పై పోరులో కీలక ముందడుగు..?గుడ్‌న్యూస్ : వైరస్‌, బ్యాక్టీరియాల పై పోరులో కీలక ముందడుగు..?coronavirus;mandula;bengaluru 1;coronavirusTue, 18 May 2021 07:11:33 GMTవైరస్, బ్యాక్టీరియాలు... కంటికి కూడా కనిపించని స్థాయిలో ఉండే ఈ సూక్ష్మ జీవాలు ఇప్పుడు మనిషిని వణికిస్తున్నాయి. హడలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ అనే ఓ చిన్న జీవి ధాటికి ఇప్పుడు ప్రపంచమే తలకిందులవుతోంది. దాన్ని కట్టడి చేసేందుకు  రెండేళ్లుగా కిందా మీదా పడుతోంది. అలాంటి వైరస్, బ్యాక్టీరియాల కట్టడి విషయంలో తాజాగా ఓ మందుడుగు పడింది. అసలు రోగానికి కారణమైన వైరస్, బ్యాక్టీరియాలను గుర్తించడంతోనే వాటిపై గెలుపుకు బీజం పడుతుంది.

ప్రస్తుతం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్తే అది వైరస్‌ వల్లనా, బ్యాక్టీరియా వల్లనా అన్నది గుర్తించకుండానే  చాలా డాక్టర్లు యాంటీబయాటిక్స్‌  రాస్తున్నారు. రోగులు వాటిని వాడేస్తున్నారు. కానీ.. మనిషికి ఏదైనా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు అది వైరస్‌ వల్ల సోకిందా.. బ్యాక్టీరియా వల్ల సోకిందా అన్న విషయం అసలు తెలియాలి. దాన్ని తెలిపే ప్రత్యేకమైన జీవపదార్థాలను  బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవ పదార్థాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఓ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు.

ఈ పరీక్ష ద్వారా అసలు ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది.. బ్యాక్టీరియాతోనా ? లేక వైరస్‌తోనా ? అనేది గుర్తిస్తారు. దీని కోసం బెంగళూరులోని ఐఐఎస్‌ఈ ఓ కొత్త పరీక్షను అభివృద్ధి చేసింది. ఈ పరీక్ష కారణంగా ఇకపై ప్రతి రోగానికి అ‌డ్డగోలుగా మందులు వాడే బాధ తప్పుతుంది. యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఇలా గుర్తించడం ఎందుకంటే.. యాంటీబయాటిక్స్‌  అనేవి బ్యాక్టీరియాపైనే  పని చేస్తాయి. వైరస్‌పై  యాంటీ బయటిక్స్ పనిచేయవు.

వ్యాధి కారణంగా వైరస్సో, బ్యాక్టీరియానో తెలియకుండా  ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల బ్యాక్టీరియాలు సైతం నిరోధకతను పెంచుకొంటున్నాయి. అంతే కాక  రోగమొకటైతే మందొకటి వేసుకోవడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ కొత్త పరీక్ష కారణంగా  ఏ రకమైన ఇన్ఫెక్షన్‌కు ఆ రకమైన మందులు ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. అసలు చాలా సార్లు ఇబ్బడి ముబ్బడిగా అవసరం లేని మందులు వేసుకోవడం కూడా మన అనారోగ్యాలకు కారణం అవుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాడులు చేయండి కానీ.. అది మాత్రం వద్దు : బైడెన్

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>