PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tauktae-cycloneb94687b6-264e-43b9-bf8f-1ad8f6fbe7b8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tauktae-cycloneb94687b6-264e-43b9-bf8f-1ad8f6fbe7b8-415x250-IndiaHerald.jpgభారత వాతావరణ విభాగం అంచనా వేసినదానికంటే ఎక్కువగా తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. గుజరాత్ తీరంలోని పోర్ బందర్ సమీపంలో తౌక్టే తీరం దాటి శాంతించినా.. తుపాను ధాటికి ఏకంగా 14మంది దుర్మరణం పాలయ్యారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. ఏకంగా 2 భారీ నౌకలు, లంగర్లు తెగిపోవడంతో సముద్రంలోనుంచి కొట్టుకుపోయాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వాటిలోనుంచి 410మందిని సురక్షితంగా రక్షించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సముద్రంలో చిక్కుకుపోయిన 12మంది మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్ సిబ్బంtauktae cyclone;rakshita;goa;kerala;india;krishna river;gujarat - gandhinagar;maharashtra - mumbai;narendra modi;prime minister;karnataka 1;arabian sea;maharashtra;sea;narendraకొంప ముంచిన తౌక్టే.. అంచనాలకు అందని భారీ నష్టం..కొంప ముంచిన తౌక్టే.. అంచనాలకు అందని భారీ నష్టం..tauktae cyclone;rakshita;goa;kerala;india;krishna river;gujarat - gandhinagar;maharashtra - mumbai;narendra modi;prime minister;karnataka 1;arabian sea;maharashtra;sea;narendraTue, 18 May 2021 07:00:00 GMTభారత వాతావరణ విభాగం అంచనా వేసినదానికంటే ఎక్కువగా తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. గుజరాత్ లోని పోర్ బందర్ సమీపంలో తౌక్టే తీరం దాటి శాంతించినా.. తుపాను ధాటికి ఏకంగా 14మంది దుర్మరణం పాలయ్యారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. ఏకంగా 2 భారీ నౌకలు, లంగర్లు తెగిపోవడంతో సముద్రంలోనుంచి కొట్టుకుపోయాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి వాటిలోనుంచి 410మందిని సురక్షితంగా రక్షించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సముద్రంలో చిక్కుకుపోయిన 12మంది మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు.


కేరళ, కర్నాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్... రాష్ట్రాలకు భారీ ముప్పు ఉంటుందని ముందుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే కేరళ, గోవాను వణికించిన తౌక్టే.. గుజరాత్, మహారాష్ట్రలను మరింతగా ఇబ్బంది పెట్టింది. ముంబయిలో ఏకంగా 55 విమాన సర్వీసుల రద్దయ్యాయి. విమానాశ్రయంలో కొన్నిగంటలసేపు రాకపోకలు స్తంభించాయి. తుపాను ప్రభావం, సహాయక చర్యలపై గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.

బంగాళాఖాతంతో పోల్చి చూస్తే.. అరేబియా సముద్రంలో తుపానులు ఏర్పడే అవకాశం తక్కువ. అందుకే.. పశ్చిమతీరంపై తుపానుల ప్రభావం పెద్దగా ఉండదు. అయితే ఈ ఏడాది భారత్ ను కలవరపెట్టిన తొలి తుపాను తౌక్టే అరేబియా సముద్రంలో ఏర్పడటం విశేషం. గంటకు 185కిలోమీటర్ల వేగంతో భారీ గాలులతో తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది తౌక్టే. ఒక్క గుజరాత్‌ రాష్ట్రం లోనే 2 లక్షలమంది ప్రజల్ని లోతట్టు ప్రాంతాలనుంచి తరలించాల్సి వచ్చింది. తుపాను ఉద్ధృతికి ముందే గుజరాత్‌ నుంచి 2 ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు ఢిల్లీకి వెళ్లడం విశేషం.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తక్కువే..
తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై.. ముఖ్యంగా రాయలసీమపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినా కేవలం కృష్ణా, ప్రకాశం జిల్లాలపై మాత్రమే ఆ ప్రభావం కనిపించింది. అకాల వర్షాలకు మామిడి రైతులు నష్టపోయారు. రాయలసీమలో వాతావరణం చల్లబడి చెదురుమదురు జల్లులు కురిశాయి. మొత్తమ్మీద ఈ ఏడాది తొలి తుపాను తౌక్టే భారత పశ్చిమతీరంపై పై తీవ్ర ప్రభావం చూపించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాడులు చేయండి కానీ.. అది మాత్రం వద్దు : బైడెన్

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>