MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/awarded-movies53c11001-74f0-4312-9021-9164af702322-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/awarded-movies53c11001-74f0-4312-9021-9164af702322-415x250-IndiaHerald.jpg2012 జూలై 6 న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈగ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ సాధిస్తాయి, మరెన్నో సినిమాలు హిట్ ను అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నేళ్లు గడిచినా మరవలేని తీపి జ్ఞాపకాలుగా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. AWARDED-MOVIES;business;nani;rajamouli;samantha;korea, south;cinema;blockbuster hit;graphics;director;hero;eega;indian;lie;maha;chitram"ఈగ" ఎగిరింది ... అవార్డుల పంట ... !"ఈగ" ఎగిరింది ... అవార్డుల పంట ... !AWARDED-MOVIES;business;nani;rajamouli;samantha;korea, south;cinema;blockbuster hit;graphics;director;hero;eega;indian;lie;maha;chitramTue, 18 May 2021 16:43:21 GMT2012 జూలై 6 న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈగ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ సాధిస్తాయి, మరెన్నో సినిమాలు హిట్ ను అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నేళ్లు గడిచినా మరవలేని తీపి జ్ఞాపకాలుగా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఈగ. ఒక ఈగను హీరోగా చేసి సినిమాను ప్రేక్షకుల హృదయానికి దగ్గర చేయడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అందులోనూ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టడం అత్యంత అద్భుతం. అలాంటి ఘనతను తన సొంతం చేసుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.

తెలుగు సినిమా రంగంలో అపజయమెరుగని దర్శకుడు ఎవరు అనగానే తెలుగు ప్రేక్షకుల నోట వచ్చే మొదటి పేరు  రాజమౌళి . ఈయన చేసే ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. బడ్జెట్ కు మించిన భారీ వసూళ్లను రాబట్టడంలో ఈయన మహా దిట్ట. అయితే ఈయన చేసిన సినిమాల్లో ఈగ మరింత ప్రత్యేకమనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని రాజమౌళి 26 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం 32 కోట్లకు అమ్ముడు కాగా, బాక్సాఫీస్ వద్ద 43 కోట్ల బిజినెస్ చేసింది. హీరో నాని, సమంత కు ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని ఉన్నత శిఖరాలను అందుకుంది ఈ చిత్రం. ఎన్నో అవార్డులను అందుకున్న  ఈ సినిమా నంది అవార్డులను కూడా సొంతం చేసుకొని తన సత్తా చాటింది.

ఈ సినిమాకు వచ్చిన అవార్డులను ఒకసారి పరిశీలిస్తే, ఈ సినిమాకు ఉత్తమ విజుఅల్ ఎఫెక్ట్స్ విభాగంలో 60 వ నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది. అదే సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ విలన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వంటి పలు విభాగాల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ  అవార్డులను దక్కించుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుతో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. మొత్తం ౮ విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది. ఈ విభగాలను చూస్తే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ప్లే రైటర్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ విలన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ లకు నంది అవార్డులు వరించాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్‌కి థర్డ్ వేవ్ ముప్పు: కేజ్రీవాల్

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>