PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar-ts-news3f19c096-f46f-42f0-8cf2-cf5237aba796-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendar-ts-news3f19c096-f46f-42f0-8cf2-cf5237aba796-415x250-IndiaHerald.jpgహుజురాబాద్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వేదిస్తున్నావు, అధిష్టానం చెప్పిన‌ట్లు విన‌కుంటే బిల్లులు రావంటూ బెదిరిస్తున్నావు.. తోడేళ్ల‌లా దాడులు చేస్తున్నావు.. బిడ్డా గుర్తుపెట్టుకో.. అధికారం శాశ్వ‌తం కాదు.. 2023 త‌రువాత నువ్వు ఉండ‌వు, నీ అధికారం ఉండ‌దు అంటూ గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి ఈట‌ల ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. క‌రీంన‌గ‌ర్‌ను బొంద‌ల గ‌డ్డ చేస్తున్నావు, నీ క‌థేంటో నాకు తెలుసు, నువ్వు ఎన్ని ట్యాక్స్ లు ఎగొట్టావో నాకు తెలుసు, టైం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ బ‌య‌ట‌పెడ‌తా జాగ్ర‌త్త‌గా ఉండు, నోరు అదుపులో పెట్టetela rajendar, ts news;kcr;mithra;telangana rashtra samithi trs;mp;minister;eega;dookudu;huzurabadనోరు అదుపులో పెట్టుకో.. నీ చిట్టా మొత్తం తెలుసు.. ఈట‌ల స్ట్రాంగ్ వార్నింగ్‌!నోరు అదుపులో పెట్టుకో.. నీ చిట్టా మొత్తం తెలుసు.. ఈట‌ల స్ట్రాంగ్ వార్నింగ్‌!etela rajendar, ts news;kcr;mithra;telangana rashtra samithi trs;mp;minister;eega;dookudu;huzurabadTue, 18 May 2021 10:56:25 GMTహుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తెరాస రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి సీఎం కేసీఆర్ బ‌ర్త‌ర‌ఫ్ చేసిన నాటి నుంచి కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల అన్న‌ట్లుగా రాష్ట్ర రాజ‌కీయాలు మారిపోయాయి. తెరాస అధిష్టానంపై ఈట‌ల మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు కంచుకోటైన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై కేసీఆర్ దృష్టిసారించారు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గంగుల దూకుడుగా వెళ్తూ ఈట‌ల వ‌ర్గీయుల‌ను క్ర‌మ‌క్ర‌మంగా తెరాస అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డేలా చేస్తున్నాడు. నియోజ‌క‌వ‌ర్గాన్ని, మీ ప్రాంతాల‌ను అభివృద్ధిచేసే బాధ్య‌త నాది అంటూ వారిలో భ‌రోసాను క‌ల్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో గంగుల త‌మ వ‌ర్గీయుల‌ను బెదిరింపుల‌కు గురిచేస్తున్నారంటూ ఈట‌ల వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

తాజాగా ఈ వ్య‌వ‌హారంపై ఈట‌ల రాజేంద‌ర్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. బిడ్డా గుర్తు పెట్టుకో అంటూ మంత్రి గంగుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈట‌ల రాజేంద‌ర్ ఈనెల 3న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ను క‌లుసుకున్నారు. ఆ త‌రువాత శామిర్‌పేట‌లోని ఆయ‌న నివాసంలో రాష్ట్ర స్థాయిలోని వివిధ పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో భేటీ అవుతున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో గంగుల దూకుడుతో క్యాడ‌ర్ చేజారుతుంద‌న్న ఆందోళ‌న‌ల ఈట‌ల వ‌ర్గీయుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. ఈక్ర‌మంలో మంగ‌ళ‌వారం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఈట‌ల‌.. తెరాస అధిష్టానం, మంత్రి గంగుల పై మాట‌ల తూటాలు పేల్చాడు. గంగుల పేరు ఎత్త‌కుండానే ఆయ‌న‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించాడు.

హుజురాబాద్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వేదిస్తున్నావు, అధిష్టానం చెప్పిన‌ట్లు విన‌కుంటే బిల్లులు రావంటూ బెదిరిస్తున్నావు.. తోడేళ్ల‌లా దాడులు చేస్తున్నావు.. బిడ్డా గుర్తుపెట్టుకో.. అధికారం శాశ్వ‌తం కాదు.. 2023 త‌రువాత నువ్వు ఉండ‌వు, నీ అధికారం ఉండ‌దు అంటూ గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి ఈట‌ల ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. క‌రీంన‌గ‌ర్‌ను బొంద‌ల గ‌డ్డ చేస్తున్నావు, నీ క‌థేంటో నాకు తెలుసు, నువ్వు ఎన్ని ట్యాక్స్ లు ఎగొట్టావో నాకు తెలుసు, టైం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ బ‌య‌ట‌పెడ‌తా జాగ్ర‌త్త‌గా ఉండు, నోరు అదుపులో పెట్టుకో.. స‌హ‌నం కోల్పోతే మ‌సిఅయిపోతావు అంటూ ఈట‌ల హెచ్చ‌రించాడు. మ‌రోవైపు ఈట‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నియోజ‌క‌వ‌ర్గంలో మా మిత్రుడికి ఇన్‌ఛార్జి ఇచ్చిన‌ట్లు తెలిసింద‌ని, కానీ మొన్న ఎంపీ ఎన్నిక‌ల్లోనూ మిగ‌తా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌క్కువ ఓట్లు వేస్తే.. 54వేల మెజార్టీ ఇచ్చి ఆదుకున్న నియోజ‌క‌వ‌ర్గం హుజురాబాద్ అని ఈట‌ల అన్నారు. హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఎవ‌రు కొన‌లేర‌ని, ఈ ప్ర‌జ‌ల మీద ఈగ వాల‌కుండా చూస్తా అంటూ ఈట‌ల పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈట‌ల వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి. మ‌రోవైపు ఈట‌ల వ్యాఖ్య‌ల‌పై తెరాస నేత‌లు ఏ విధంగా స్పందిస్తారోన‌న్న చ‌ర్చసాగుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామకు అండగా అభిమానులు ..!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>