PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dk-aruna-bjp-jagan47045a70-ce5b-44f3-beae-1087edcd07da-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dk-aruna-bjp-jagan47045a70-ce5b-44f3-beae-1087edcd07da-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోంది అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎట్లాంటి సాయమన్నా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అని స్పష్టం చేసారు. కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోంది అని మండిపడ్డారు. అయినా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్ డెసివిర్, వెంటిలేటర్ల విషయంగా భారీగా అందజేసింది అని ఆమె తెలిపారు. పేద ప్రజలకు కోవిడ్ చికిత్స భారం నుంచి రూ.5 లక్షల వరకు కాపాడే ఆయుష్మాన్ భారత్ ను అమలు చdk aruna,bjp,jagan;kcr;amala akkineni;vijayashanti;bharatiya janata party;india;jagan;telangana;mp;media;central governmentజగన్ చేసింది మీరు చేయాల్సిందే అంటున్న బిజెపిజగన్ చేసింది మీరు చేయాల్సిందే అంటున్న బిజెపిdk aruna,bjp,jagan;kcr;amala akkineni;vijayashanti;bharatiya janata party;india;jagan;telangana;mp;media;central governmentTue, 18 May 2021 18:00:00 GMTదేశంలో కరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోంది అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎట్లాంటి సాయమన్నా చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అని స్పష్టం చేసారు. కరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోంది అని మండిపడ్డారు. అయినా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్, రెమ్ డెసివిర్, వెంటిలేటర్ల విషయంగా భారీగా అందజేసింది అని ఆమె తెలిపారు. పేద ప్రజలకు కోవిడ్ చికిత్స భారం నుంచి రూ.5 లక్షల వరకు కాపాడే ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయడం లేదు అని అన్నారు.

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరిగే గరీబోళ్ల కోసం బిజెపి దీక్షను విజయవంతం చేద్దాం అని ఆమె కోరారు. ఎవరింట్లో వాళ్లు కోవిడ్, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి దీక్ష చేయాలి అని విజ్ఞప్తి చేసారు. మీడియా, సోషల్ మీడియా, వర్చువల్ మీడియా ద్వారా దీక్ష ను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిపిద్దాం అని అన్నారు. మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారు అని మండిపడ్డారు.

ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణలేదు అని అన్నారు. ఫిజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొర కు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదు అని ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుంది అని అన్నారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయింది అన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్ తో రేపు జరగబోతున్న “ గరీబోళ్ల కోసం బిజెపి దీక్ష” ను విజయవంతం చేయండి అని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామను కొడితే ఇబ్బంది పడేది ఎవరు...?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>