PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-ts-newscd48d6d3-c29c-41bf-85ef-2eb9b4042fce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-ts-newscd48d6d3-c29c-41bf-85ef-2eb9b4042fce-415x250-IndiaHerald.jpg2023 త‌రువాత నీ అధికారం ఉండ‌దు అంటూ ఈట‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు ప‌లువిధాలుగా తీసుకుంటున్నారు. ఈట‌ల అన్న‌ది కేసీఆర్‌ను ఉద్దేశించే అంటూ ప‌లువురు తెరాస నేత‌లు పేర్కొంటున్నారు. 2023 త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అప్పుడు తెరాస ఓట‌మి ఖాయ‌మ‌ని, కేసీఆర్ అధికారంలోకి రాడ‌న్న భావ‌న‌తోనే ఈట‌ల ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.etela rajender, ts news;kcr;telangana rashtra samithi trs;రాజీనామా;backward classes;assembly;minister;party;huzurabad2023 త‌ర్వాత కేసీఆర్ గ‌ద్దెదిగుతాడా? ఈట‌ల వ్యాఖ్య‌ల్లో అర్థ‌మేంటి?2023 త‌ర్వాత కేసీఆర్ గ‌ద్దెదిగుతాడా? ఈట‌ల వ్యాఖ్య‌ల్లో అర్థ‌మేంటి?etela rajender, ts news;kcr;telangana rashtra samithi trs;రాజీనామా;backward classes;assembly;minister;party;huzurabadTue, 18 May 2021 16:40:00 GMTహుజురాబాద్ రాజ‌కీయాలు హీటెక్కాయి. నువ్వా నేనా అన్న‌ట్లు ఈట‌ల వ‌ర్సెస్ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ల మ‌ధ్య మాట‌ల దాడి కొన‌సాగింది. ఈట‌ల‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన నాటి నుంచి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై తెరాస అధిష్టానం ఫోక‌స్ పెట్టింది. ఈట‌ల ప‌ట్టును త‌గ్గించేలా పావులు క‌దుపుతుంది. ఈ క్ర‌మంలోనే గంగుల క‌మ‌లాక‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పాగావేసి ఈట‌ల అనుచ‌రుల‌ను ఒక్కొక్క‌రిని పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డేలా చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ఈట‌ల.. గంగుల‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు చ‌ల్ల‌గా చూడ‌మ‌ని గంగుల‌ను గెలిపించార‌ని, హుజురాబాద్‌పై ప‌డి బెదిరించ‌మ‌ని కాద‌ని అన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు చిన్న‌చిన్న కాంట్రాక్టులు చేస్తే, మండ‌ల‌, గ్రామాల అభివృద్ధికి ప‌నులు నిర్వ‌హిస్తే వాటి బిల్లులు ఆపిస్తాన‌ని బెదిరించ‌డం స‌రికాద‌ని అన్నారు.

2023 త‌రువాత నీ అధికారం ఉండ‌దు అంటూ ఈట‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు ప‌లువిధాలుగా తీసుకుంటున్నారు. ఈట‌ల అన్న‌ది కేసీఆర్‌ను ఉద్దేశించే అంటూ ప‌లువురు తెరాస నేత‌లు పేర్కొంటున్నారు. 2023 త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అప్పుడు తెరాస ఓట‌మి ఖాయ‌మ‌ని, కేసీఆర్ అధికారంలోకి రాడ‌న్న భావ‌న‌తోనే ఈట‌ల ఈ వ్యాఖ్య‌లు చేశాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అధికారం శాశ్వ‌తం అనుకుంటే భ్ర‌మ‌లో ఉన్న‌ట్లే అని, ప్ర‌జ‌ల‌ను చిన్న‌చూపు చూస్తే వారికి భ‌విష్య‌త్తులో అదే గ‌తి ప‌డుతుంద‌ని గంగుల‌ను ఉద్దేశించి ఈట‌ల వ్యాఖ్యానించారు. అయితే ఈట‌ల మాట్లాడిన మాటల్లో అధిక‌శాతం సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన‌ట్లే ఉంద‌న్న అభిప్రాయం తెరాస శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది.

ఈట‌ల వ్యాఖ్య‌ల‌కు గంగుల క‌మ‌లాక‌ర్ వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చారు. ఈట‌ల బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌ని, హుజురాబాద్ ప్ర‌జ‌లు ఈట‌ల వెంటే ఉంటే ఎందుకు రాజీనామా చేయ‌ట్లేద‌ని అన్నారు. ద‌మ్ముంటే వెంట‌నే రాజీనామా చేసి ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని గంగుల ఈట‌ల‌కు స‌వాల్ విసిరారు. నువ్వు బీసీవైతే నేను బీసీనేని అన్నారు. అయితే ఈట‌ల హుజురాబాద్‌లో బీసీ అని, హైద‌రాబాద్‌లో ఓసీ అంటూ గంగుల వ్యాఖ్యానించారు. ఒకేరోజు వెంట‌వెంట‌నే ప్రెస్‌మీట్‌లు పెట్టి ఈట‌ల‌, గంగుల ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకున్నారు. ఇదిచూసిన తెరాస శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఎంజాయ్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్‌కి థర్డ్ వేవ్ ముప్పు: కేజ్రీవాల్

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?

బుల్లితెరపై నటించే ఈ 12 మంది హీరయిన్ల వయసు ఎంతో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>