PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9be0b035-0d54-4564-beba-fd3f22e9ca3a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9be0b035-0d54-4564-beba-fd3f22e9ca3a-415x250-IndiaHerald.jpgసినీ న‌టుడు సోనూసూద్ మ‌రోమారు త‌న గొప్ప మ‌నసు చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్ల‌తో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరు న‌గ‌రంలోని జెండా వీధిలో ఉంటున్న సోనూ సూద్ మిత్రుడు స‌మీర్‌ఖాన్ కుటుంబ స‌భ్యుల‌కు ఇటీవ‌లే క‌రోనా సోకింది. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు దొర‌క్క వారు మృత్యువాత ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లాలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని సోనూసూద్‌ను స‌మీర్‌ఖాన్ కోరారు. సోనూ సానుకూలంగా స్పందించ‌డంతో స‌మీర్‌ఖాన్ ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసcorona;mithra;odisha;district;nellore;ministerనెల్లూరులో సోనూసూద్ ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు?నెల్లూరులో సోనూసూద్ ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు?corona;mithra;odisha;district;nellore;ministerTue, 18 May 2021 10:19:12 GMTసినీ న‌టుడు సోనూసూద్ మ‌రోమారు త‌న గొప్ప మ‌నసు చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్ల‌తో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరు న‌గ‌రంలోని జెండా వీధిలో ఉంటున్న సోనూ సూద్ మిత్రుడు స‌మీర్‌ఖాన్ కుటుంబ స‌భ్యుల‌కు ఇటీవ‌లే క‌రోనా సోకింది. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు దొర‌క్క వారు మృత్యువాత ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు  జిల్లాలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని సోనూసూద్‌ను స‌మీర్‌ఖాన్ కోరారు. సోనూ సానుకూలంగా స్పందించ‌డంతో స‌మీర్‌ఖాన్ ఈ విష‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువెళ్లారు. సోనూసూద్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆత్మ‌కూరు లేదా కావ‌లి ప్రాంతంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు.

ధ్రువీక‌రించిన మంత్రి గౌత‌మ్‌రెడ్డి
ప్లాంట్ ఏర్పాటుపై సోనూసూద్ హామీ ఇచ్చిన విష‌యాన్ని అదే జిల్లాకు చెందిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ధ్రువీక‌రించారు. జిల్లాలో రెండు ట‌న్నుల సామ‌ర్థ్యం ఉన్న ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటుకు అస‌వ‌ర‌మైన నిధుల‌ను సోనూసూద్ అంద‌జేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్‌కు స‌మాచారం పంపార‌ని, త్వ‌ర‌లో దీని నిర్మాణాన్ని చేప‌ట్ట‌బోతున్న‌ట్లు గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఉన్న గౌత‌మ్‌రెడ్డి ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ప‌లు రాయితీలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయ‌డానికి ముందుకువ‌చ్చేవారికి ప్ర‌భుత్వ ప‌రంగా ప్రోత్సాహ‌కాలు, రాయితీలు ఇవ్వ‌డంతోపాటు కావ‌ల్సిన అనుమ‌తుల‌న్నీ యుద్ధ‌ప్రాతిప‌దికన మంజూరు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల కోసం గ్రీన్ ఛానెల్‌
ఏపీలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల కోసం గ్రీన్‌చానెల్ ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ బాధితుల‌కు అత్య‌వ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎక్క‌డా ఎలాంటి అంత‌రాయం లేకుండా ఉండేందుకు ప్రాణ‌వాయువు తీసుకొచ్చే ట్యాంక‌ర్ల కోసం ఈ గ్రీన్ ఛానెళ్లు ఏర్పాటు చేసిన‌ట్లు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ తెలిపారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే 11 ప్లాంట్ల‌ను మ్యాపింగ్ చేశామ‌ని, అక్క‌డినుంచి ఎలాంటి అవ‌రోధాలు లేకుండా రాష్ట్రానికి చేరేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. దీనికోసం ఒడిశా, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క డీజీపీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు ప్ర‌యాణించే మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ వామ‌నాల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరామ‌ని, ప్ర‌తి ట్యాంక‌ర్‌కు జీపీఎస్ అమ‌రుస్తున్న‌ట్లు డీజీపీ వెల్ల‌డించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవాగ్జిన్ సేఫ్..మరి కోవాషీల్డ్ తో ముప్పేనా ?

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>