PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modic5d9a695-86c5-4f72-9544-a8823cf95b80-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modic5d9a695-86c5-4f72-9544-a8823cf95b80-415x250-IndiaHerald.jpgదేశంలోని కరోనా టీకా కొరతను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో భాగంగా మరికొన్ని విదేశీ టీకా సంస్థలకు అనుమతిస్తున్నామని, దేశంలో టీకా సరఫరా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని మోదీ అన్నారు. టీకాలు అందక ప్రజల్లో పెరిగిన భయాందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వం రాత్రింబవళ్ళు శ్రమిస్తుందని, ఈ క్రమంలోనే దేశంలో టీకాల సరఫరాను గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని మోదీ అన్నారు. అంతేకాకుండా మరికొన్ని విదేశీ వ్యాక్సిన్ సంస్థలతో..modi;delhi;narendra modi;district;prime minister;service;central government;narendra'టీకా'పై ఇక నో ఢోకా.. రాష్ట్రాలకు 15రోజుల ముందే షెడ్యూల్!!'టీకా'పై ఇక నో ఢోకా.. రాష్ట్రాలకు 15రోజుల ముందే షెడ్యూల్!!modi;delhi;narendra modi;district;prime minister;service;central government;narendraTue, 18 May 2021 18:16:00 GMTన్యూఢిల్లీ: దేశంలోని కరోనా టీకా కొరతను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో భాగంగా మరికొన్ని విదేశీ టీకా సంస్థలకు అనుమతిస్తున్నామని, దేశంలో టీకా సరఫరా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని మోదీ అన్నారు. టీకాలు అందక ప్రజల్లో పెరిగిన భయాందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వం రాత్రింబవళ్ళు శ్రమిస్తుందని, ఈ క్రమంలోనే దేశంలో టీకాల సరఫరాను గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నామని మోదీ అన్నారు. అంతేకాకుండా మరికొన్ని విదేశీ వ్యాక్సిన్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. దాంతో పాటుగా డీఆర్‌డీఓ తయారుచేసిన 2డీజీ ఔషధాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


వివిధ జిల్లా అధికారులతో వర్చువల్‌గా సమావేశం అయిన మోదీ ఈ ప్రణాళికకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపారు. కేంద్రం చేపట్టిన కొత్త ప్రణాళికలో భాగంగా టీకా సరఫరాకు సంబంధించిన షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా ప్రతి రాష్ట్రానికి అందజేస్తామని, ఆ షెడ్యూల్‌కి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు చేసుకోగలుగుతాయని మోదీ చెప్పారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సేవ చేస్తున్న జిల్లా అధికారులను మోదీ ప్రశంసించారు. కరోనాతో దేశం చేసిన యుద్దంలో జిల్లా అధికారులు కమాండర్ల పాత్రను పోషించారని ఆయన అన్నారు.



అంతేకాకుండా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజా సేవకు, తమ విధి నిర్వహణకు అధికారులు పెద్ద పీట వేయడం ప్రశంసనీయం అని ఆయన అన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో పాటించవలసిన నిబంధనలను ఆయన తెలిపారు. పరీక్షలు చేయడం, ట్రాకింగ్, చికిత్స అందించడం అనేవి రోగాన్ని నిరోధించడంలో చాలా ముఖ్యమని మోదీ అన్నారు. అయితే ప్రజలకు కరోనాపై అవగాహన వచ్చేలా చేయాలని, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ద చూపాలని మోదీ చెప్పారు. ఇప్పటికే అధికారులు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేసేందుకు విఫలప్రయత్నాలు చేస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో థర్డ్ వేవ్.. అక్కడినుండేనట?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>