PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manish4514e9fc-8c4a-43ea-8159-d2a471ed6051-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manish4514e9fc-8c4a-43ea-8159-d2a471ed6051-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతి పక్షాలు అంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రతిష్ట కోసం ఎందరో అమాయక భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రతిష్టకోసం..manish;manish;pratishta;rahul new;rahul;tiru;delhi;k l rahul;india;rahul gandhi;mohandas karamchand gandhi;congress;mp;kanna lakshminarayana;rahul sipligunj;service;central government;oxygen;manish pandeyప్రతిష్ట కోసం ఇంత దిగజారతారా.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్..ప్రతిష్ట కోసం ఇంత దిగజారతారా.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్..manish;manish;pratishta;rahul new;rahul;tiru;delhi;k l rahul;india;rahul gandhi;mohandas karamchand gandhi;congress;mp;kanna lakshminarayana;rahul sipligunj;service;central government;oxygen;manish pandeyTue, 18 May 2021 14:22:43 GMTన్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతి పక్షాలు అంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రతిష్ట కోసం ఎందరో అమాయక భారతీయుల ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రతిష్టకోసం ఎవరైనా ఇంతలా దిగజారతారా అని మనీష్ అన్నారు. కేంద్రం ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా తన సొంత ప్రతిష్ట కోసం పాటుపడిందని ఆయన అన్నారు.


ఇప్పటి వరకు మన దేశంలో జరిగిన వ్యాక్సినేషన్ కన్నా ఎక్కువ టీకాలను భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసిందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఇదివరకు అమెరికాలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కూడా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టుకుంటుందని, తప్పుడు ప్రతిష్ట కోసం తన దేశ ప్రజలను చంపుకునేందుకు కూడా కేంద్రం సిద్ధమైందని మనీష్ ఆరోపించారు. దాంతో పాటుగా దేశంలో ఉన్న ఔషధ, ఆక్సిజన్ కొరతను ఆయన ఎత్తి చూపారు. దేశంలో కరోనా సంబంధిత ఔషధాల కొరత, ఆక్సిజన్ కొరతను నిలువరించేందుకు ప్రభుత్వం కేవలం నామమాత్రపు చర్యలు తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఇదిలా ఉంటే దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ విషయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే పలుమార్లు స్పందించారు. దేశంలో టీకాలు లేక వ్యాక్సిన్ కేంద్రాలు మూతబడుతుంటే మరో పక్క కేంద్రం మన దేశ ప్రజల టీకాలను విదేశాలకు ఎగుమతి చేస్తోందని, కేంద్రం ఏం సాధించాలని ఈ చర్యలు చేస్తుందో అర్థం కావడం లేదని రాహుల్ అన్నారు. ఇప్పటికే దేశంలో ఎందరో ప్రజలు వ్యాక్సిన్, ఆక్సిజన్ అందక మరణించారని, మన దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టి విదేశాలకు సాయం చేయడమేంటని రాహుల్ ప్రశ్నించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్ చేస్తా.. పవన్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>