EditorialVijayaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghuram-krishnamraju-ycp-narasapuram-mp-jagan-chandrababu-tdp23dd9bb9-ea99-4779-95c4-f8b62ac0c8ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/raghuram-krishnamraju-ycp-narasapuram-mp-jagan-chandrababu-tdp23dd9bb9-ea99-4779-95c4-f8b62ac0c8ea-415x250-IndiaHerald.jpgఇలాంటి పరిస్దితుల్లో జగన్ ముఖ్యమంత్రి కాగానే కారణాలు స్పష్టంగా తెలియవుగానీ జగన్ తో గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే జగన్ తో గొడవులు మొదలయ్యాయో వెంటనే ఎంపి పదవికి రాజీనామా చేసుంటే చాలా హుందాగా ఉండేది. ఇఫ్పటి రాజకీయాల్లో టార్చిలైట్ వేసి వెదికినా చాలామందిలో కనిపించని లక్షణం అదే కాబట్టి ఎంపి రాజీనామా చేయలేదని అనుకుందాం. పోనీ రాజీనామా చేయకపోతే పోయారు కనీసం మాట్లాడకుండా అన్నా కూర్చోవాల్సింది. పార్టీలో నేతలతో గొడవలైనా దాన్ని జగన్ కు చుట్టకుండా ఉండాల్సింది. ఇక్కడే ఎంపి చేసిన తప్పులు బాగా కనబడుతున్నాయి. raghuram krishnamraju ycp narasapuram mp jagan chandrababu tdp;krishna;raghu;tara;tiru;korcha;jagan;y. s. rajasekhara reddy;2019;mp;రాజీనామా;court;chief minister;king;ycp;father;reddy;torchlight;party;raccha;katthiహెరాల్డ్ ఎడిటోరియల్ : చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే ఇదేనా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే ఇదేనా ?raghuram krishnamraju ycp narasapuram mp jagan chandrababu tdp;krishna;raghu;tara;tiru;korcha;jagan;y. s. rajasekhara reddy;2019;mp;రాజీనామా;court;chief minister;king;ycp;father;reddy;torchlight;party;raccha;katthiTue, 18 May 2021 03:00:00 GMT‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా’ అని పెద్దలు ఊరికే అనలేదు. అనవసరంగా గెలిచిన పార్టీ మీదే దుమ్మెత్తిపోశారు. కూర్చున్న కొమ్మనే నరకాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చివరకు తాను ఉపయోగించిన కత్తి దెబ్బ తనపైనే పడింది. ఇదంతా ఎవరి కోసమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవును నరసాపురం వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గురించే. హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చోవాల్సిన రాజుగారు అనవసరంగా వివాదాలను కెలుక్కుని చతికలపడ్డారు. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితోనే కయ్యానికి కాలుదువ్వారు. చివరకు ఆయనే బోల్తాపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో చివరినిముషంలో వైసీపీలో చేరి టికెట్ దక్కించుకోవటమే చాలా ఎక్కువ. అలాంటిది ఏదో గెలిచానంటే గెలిచాననిపించుకున్నారు.




ఇలాంటి పరిస్దితుల్లో జగన్ ముఖ్యమంత్రి కాగానే కారణాలు స్పష్టంగా తెలియవుగానీ జగన్ తో గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే జగన్ తో గొడవులు మొదలయ్యాయో వెంటనే ఎంపి పదవికి రాజీనామా చేసుంటే చాలా హుందాగా ఉండేది. ఇఫ్పటి రాజకీయాల్లో టార్చిలైట్ వేసి వెదికినా చాలామందిలో కనిపించని లక్షణం అదే కాబట్టి ఎంపి రాజీనామా చేయలేదని అనుకుందాం. పోనీ రాజీనామా చేయకపోతే పోయారు కనీసం మాట్లాడకుండా అన్నా కూర్చోవాల్సింది. పార్టీలో నేతలతో గొడవలైనా దాన్ని జగన్ కు చుట్టకుండా ఉండాల్సింది. ఇక్కడే ఎంపి చేసిన తప్పులు బాగా కనబడుతున్నాయి.




వైఎస్సార్సీపీ పార్టీ అసలు  జగన్ దే కాదని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయటమే ఎంపి చేసిన పెద్ద తప్పు. వైఎస్సార్సీపీ గుర్తును రద్దు చేయాలని పదే పదే డిమాండ్ చేశారు. తాను పోటీచేసిన పార్టీ గుర్తే జగన్ ది కాదని కాబట్టి పార్టీ గుర్తును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రం. సరే ఈ వివాదం ఇలాగుండగానే జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. జగన్ బెయిల్ రద్దుచేయించి తిరిగి జైలుకు పంపిస్తానంటు చాలెంజ్ చేశారు. చాలెంజ్ చేయటమే కాకుండా కోర్టులో కేసు కూడా వేశారు. జగన్ అసలు రెడ్డేకాదని కాపని కాపంటు రచ్చ మొదలుపెట్టారు. తండ్రి వైఎస్సార్ కాపు అయినపుడు కొడుకు జగన్ రెడ్డి ఎలాగవుతారంటు గోల మొదలుపెట్టారు. చివరగా పదేళ్ళుగా మానసిక సమస్యలకు జగన్ ఇంగ్లాండులో చికిత్స చేయించుకున్న విషయం తనకు తెలుసన్నారు. ఇలాంటి అనవసరమైన చెత్తనంతా నెత్తినేసుకోబట్టి ఇపుడు తిరుగుబాటు ఎంపి 3468 నెంబరు ఖైదీగా జైలులో ఉన్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ లిస్ట్ లో.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>