Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/sonu-sood-tweeted-about-a-real-hero-from-apcc1ee779-7cf3-40bd-8e5c-b201159f38e3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/sonu-sood-tweeted-about-a-real-hero-from-apcc1ee779-7cf3-40bd-8e5c-b201159f38e3-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో అనేకమంది పేదలకు, సామాన్యులకు, అన్నార్తులకు దేవుడిగా మారాడు సోనూసూద్. రీల్ విలన్ అయినా.. రియల్ హీరోగా మారాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో లక్షల మందిని తమ సొంత ప్రాంతాలకు పంపాడు. దానికోసం విమానాలు, బస్సులు, ట్రైన్లు అన్ని రకాల ప్రయాణ సాధనాలనూ ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపాడు. ఆర్థికంగా అండగా నిలిచాడు. ఇక ఈ ఏడాది మళ్లీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా సోనూ మళ్లీ తన గొప్పతనాన్ని..sonusood;women;deva;jeevitha rajaseskhar;kirti;bus;twitter;woman;service;oxygenమరో రియల్ హీరోను పరిచయం చేసిన సోనూసూద్.. కాళ్లు లేకపోయినా..మరో రియల్ హీరోను పరిచయం చేసిన సోనూసూద్.. కాళ్లు లేకపోయినా..sonusood;women;deva;jeevitha rajaseskhar;kirti;bus;twitter;woman;service;oxygenTue, 18 May 2021 23:48:25 GMTకరోనా సమయంలో అనేకమంది పేదలకు, సామాన్యులకు, అన్నార్తులకు దేవుడిగా మారాడు సోనూసూద్. రీల్ విలన్ అయినా.. రియల్ హీరోగా మారాడు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో లక్షల మందిని తమ సొంత ప్రాంతాలకు పంపాడు. దానికోసం విమానాలు, బస్సులు, ట్రైన్లు అన్ని రకాల ప్రయాణ సాధనాలనూ ఏర్పాటు చేసి వారిని ఇళ్లకు పంపాడు. ఆర్థికంగా అండగా నిలిచాడు. ఇక ఈ ఏడాది మళ్లీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా సోనూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ వంటివన్నీ అందిస్తూ రాత్రింబవళ్లు సేవ చేస్తున్నాడు.

సోనూ గొప్పతనం ప్రజలను కూడా కదిలిస్తోంది. దీంతో దేశం నలుమూలల నుంచి ఎంతో మంది సోనూకు విరాళాలు అందిస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది పేదలుకూడా ఉన్నారు. ఇటీవల ఓ అంధురాలైన మహిళ తన 3 నెలల పెన్షన్ డబ్బులను సోనూకు విరాళంగా పంపింది. దీంతో ఆమెను ప్రశంసిస్తూ సోననూసూద్ ఓ ట్వీట్ కూడా చేశాడు. ‘తన దృష్టిలో ప్రపంచంలోనే ఆమె అత్యంత ధనవంతురాలం’టూ కీర్తించాడు. కాగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగ యువకుడు సోనూకు విరాళం అందించాడు. దీంతో అతడిని కుర్రాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన అఫ్రిది అనే యువకుడు తన 3 నెలల జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా పంపాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న అఫ్రిది ఒక యాక్సిడెంటులో కాళ్లు పోగొట్టుకున్నాడు. అయినాసరే ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు పంపించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సోనూసూద్.. ఇలాంటి హీరోలే ప్రపంచాన్ని మరింత గొప్ప ప్రదేశంగా మారుస్తారని పేర్కొన్నాడు.

అలాగే అఫ్రిది చేసిన సాయంతో తాను కచ్చితంగా ఒకరి జీవితంలో నవ్వులు పూయిస్తానని హామీ ఇచ్చాడు. కాగా.. కరోనా బారిన పడిన వారికి సోనూ చేస్తున్న సాయాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ అనేకమంది ఆయనకు విరాళాలు పంపుతున్నారు.
">
" style="height: 369px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ వైసీపీ ఎంపీలని గుర్తుపట్టడం కష్టమేనా?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>