PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-pattabhi-sensational-commentsf059561a-47de-4456-8eaa-f3cd551a038f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-leader-pattabhi-sensational-commentsf059561a-47de-4456-8eaa-f3cd551a038f-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకు దాని కోసం ప్రభుత్వం రూ.2,229 కోట్లు ఖర్చు చేసింది అని ఆయన వివరించారు. ఈ లెక్కలు ముఖ్యమంత్రి సొంతపత్రిక సాక్షిలోనే రాశారు అని అన్నారు. అందులో రాష్ట్రప్రభుత్వ వాటాకేవలం రూ.934కోట్లు అని ఆయన పేర్కొన్నారు. మందులు, సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు రూ.2075 కోట్లు ఖర్చుపెట్టినట్టు రాశారు అని అన్నారు. రూ.2,294కోట్లలో రూ.2075కోట్లు పోతే, ఇక ఆసుపత్రుల్లోసౌకర్యాలకు ఏం ఖరpattabhi,tdp,ap;mandula;andhra pradesh;chief minister;tdp;central government;oxygenకరోనాకు ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఖర్చు చేసింది ఎంత...?కరోనాకు ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఖర్చు చేసింది ఎంత...?pattabhi,tdp,ap;mandula;andhra pradesh;chief minister;tdp;central government;oxygenTue, 18 May 2021 12:16:16 GMTటీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకు దాని కోసం ప్రభుత్వం రూ.2,229 కోట్లు ఖర్చు చేసింది అని ఆయన వివరించారు. ఈ లెక్కలు ముఖ్యమంత్రి సొంతపత్రిక సాక్షిలోనే రాశారు అని అన్నారు. అందులో రాష్ట్రప్రభుత్వ వాటాకేవలం రూ.934కోట్లు అని ఆయన పేర్కొన్నారు. మందులు, సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు రూ.2075 కోట్లు ఖర్చుపెట్టినట్టు రాశారు అని అన్నారు.

రూ.2,294కోట్లలో రూ.2075కోట్లు పోతే, ఇక ఆసుపత్రుల్లోసౌకర్యాలకు ఏం ఖర్చుపెట్టారు? అని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు,  ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు సున్నా అని ఆయన ఆరోపించారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు,  ఐసీయూ పడకలు లేక ప్రజలు చనిపోతున్నా కూడా ఈ ముఖ్యమంత్రి  వాటికి రూపాయి కూడా ఖర్చుచేయలేదు అని అన్నారు. మరో పక్క జీతాలకు రూ.900 కోట్లు అయితే, జీతాల కోసం ప్రంట్ లైన్ వారియర్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలుఎందుకు చేశారు? అని ఆయన నిలదీశారు.

ముఖ్యమంత్రి జీతాలు, మందుల పేరుతో కరోనా నిధులను ఎవరికి దోచిపెట్టాడు?  అని ఆయన ప్రశ్నించారు. మరోపక్క ల్యాబోరేటరీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నయాపైసా ఖర్చుపెట్టలేదు అని మండిపడ్డారు. మరోపక్క రాష్ట్రంలో ల్యాబోరేటరీల సంఖ్యను విపరీతంగా పెంచామని సాక్షిలోరాశారు అని రాష్ట్రంలో మొత్తం ల్యాబోరేటరీలు 126 ఉంటే, ప్రభుత్వ లేబోరేటరీలు కేవలం 79మాత్రమే అని ఆయన ఆరోపించారు.  ఏపీలో 126 ఉంటే, కేరళలో 160 ఉన్నాయి అని అన్నారు.  126 ల్యాబోరేటరీల్లో ట్రూనాట్ ల్యాబ్ లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది అని తెలిపారు. కొత్తగా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా ఒక్క ల్యాబోరేటరీకూడా పెట్టలేదు అని ఆయన విమర్శించారు. మందులు, జీతాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ ఈ ముఖ్యమంత్రి మింగేశాడు అని మండిపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న సుకుమార్..

నెవర్ బిఫోర్ రోల్ లో ప్రభాస్!

తొలి తెలుగు కమెడియన్ ..కార్లు తిరిగిన చోట అనాధ శవం గా

టాలీవుడ్ పేరు నిలబెట్టిన సినిమా.. ఆస్కార్ నామినీ వరకు వెళ్లి..!!

అలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. ప్రపంచంలోనే తొలిసారి..!!

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>