Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbief486313-0a92-4d72-aec9-ffeb18ffedf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbief486313-0a92-4d72-aec9-ffeb18ffedf0-415x250-IndiaHerald.jpgదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ బ్యాంకుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కువమంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకు కూడా ఈ బ్యాంక్ దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులు తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో తమ కస్టమర్లను అందరికీ ఎంతగానో ప్రయోజనం చేకూరే వSbi;india;rbi;sbi;bank;king;good news;king 1;banking;customer;good newwz;coronavirusగుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్.. ఇక ఆ సర్వీస్ కూడా ఇంటి నుండి పొందొచ్చు?గుడ్ న్యూస్ చెప్పిన స్టేట్ బ్యాంక్.. ఇక ఆ సర్వీస్ కూడా ఇంటి నుండి పొందొచ్చు?Sbi;india;rbi;sbi;bank;king;good news;king 1;banking;customer;good newwz;coronavirusTue, 18 May 2021 15:00:00 GMTబ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ బ్యాంకుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కువమంది కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకు కూడా ఈ బ్యాంక్ దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల సర్వీసులు తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ముఖ్యంగా కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో తమ కస్టమర్లను అందరికీ ఎంతగానో ప్రయోజనం చేకూరే విధంగా కస్టమర్ల రక్షణ దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినూత్న మైన సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.



 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడానికి ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండేందుకు వినూత్న టెక్నాలజీతో కూడిన సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నుంచి బ్యాంకుకు వెళ్లకుండానే కొన్ని రకాల సర్వీసులను ఇంటి వద్ద నుంచి పొందేందుకు అవకాశం ఉంది. సాధారణంగా అయితే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అంటే బ్యాంకు వెళ్లాల్సి ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఇంట్లో నుండి మీకు సంబంధించిన అకౌంట్ కు అనుసంధానం అయి ఉన్న మొబైల్ ని ఇంటినుంచే అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది.


 దీనికోసం మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే సరిపోతుంది. ఎస్బిఐ కస్టమర్ లు మూడు ఆప్షన్లు ద్వారా వారి మొబైల్ నెంబర్ మార్చుకునేందుకు వీలు ఉంది. ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. దీనికోసం ముందుగా ప్రొఫైల్ టాబ్ లోకి వెళ్లి పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక ఆ తర్వాత పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఆప్షన్ చూపిస్తుంది. మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అనుకుంటే మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఎంచుకుని కొత్త కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత కొత్త మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఇక ఆ ఓటిపి ఎంటర్ చేశారు అంటే నెంబర్ అప్డేట్ అవుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీమిండియా క్రికెటర్ తల్లి కరోనాతో మృతి..!!

చిరంజీవి అక్క గా నటించిన ఈ నటిని గుర్తు పట్టారా..?

దూకుడు తో దుమ్మురేపిన సూపర్ స్టార్ ..... !!

అప్పట్లో స్టార్ హీరోలకు సైతం గట్టిపోటీ ఇచ్చిన నటి..

తెలుగు లో టాప్ 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ పొందిన సినిమాలు ఇవే

ఎన్‌టీఆర్ కొత్తగా ట్రైచేసిన సినిమా.. ఎన్ని అవార్డులో.. !

సెక్యూరిటీ పెంచేసిన మహేష్.. అసలు కారణం అదేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>