PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/raghurama-1ca2eb69-f365-4074-b0c2-03b9461b1b3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/raghurama-1ca2eb69-f365-4074-b0c2-03b9461b1b3c-415x250-IndiaHerald.jpgఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయం బాగా హైలైట్ అయిపోయింది. ఈయన అరెస్ట్ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. అసలు వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, అదే పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ నేతల మాదిరిగానే రాజుగారు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.raghurama;raghu;ramakrishna;ramaraju;jagan;andhra pradesh;mp;government;police;media;king;arrest;tdp;ycp;reddyబాబు డైరక్షన్‌లో రాజుగారు...మరి వారి సంగతి ఏంటి?బాబు డైరక్షన్‌లో రాజుగారు...మరి వారి సంగతి ఏంటి?raghurama;raghu;ramakrishna;ramaraju;jagan;andhra pradesh;mp;government;police;media;king;arrest;tdp;ycp;reddyTue, 18 May 2021 00:00:00 GMTఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయం బాగా హైలైట్ అయిపోయింది. ఈయన అరెస్ట్ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. అసలు వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ, అదే పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ నేతల మాదిరిగానే రాజుగారు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.


తాజాగా ఆయన విమర్శలు హద్దులు దాటాయి. జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు. అలాగే రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఏపీ సి‌ఐడి ఆయనపై కేసు పెట్టి, అరెస్ట్ చేసి, విచారణ చేస్తోంది. మరోవైపు రాజుగారు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే రాజుగారి అరెస్ట్‌ని వైసీపీ నేతలు సమర్ధిస్తున్నారు.


చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామ పనిచేస్తున్నారని.. రఘురామరాజుకు సీఎం జగన్‌ అన్ని విధాలా సహకరించారని, అయినా ప్రభుత్వంపై రఘురామ కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా రఘురామ కుట్రలు చేస్తున్నారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. బెయిల్ రాకపోవడం వల్లే రఘురామ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. 


అయితే ఇక్కడ రాజుగారు డ్రామాలు ఆడుతున్నారో లేదో ప్రజలకు అర్ధమవుతుంది. అలాగే ఆయన ఇంతకాలం బాబు డైరక్షన్‌లోనే విమర్శలు చేశారనేది కూడా ప్రజలు చూశారని, కానీ రాజుగారిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని అందులో ఎలాంటి అనుమానం లేదని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి.

ఇక ఏపీ పోలీసులు, అధికారులు ఎవరి డైరక్షన్‌లో పనిచేస్తారో కూడా తెలుసని అంటున్నారు. అయితే ఇక్కడ రాజుగారు విమర్శలు కాస్త ఎక్కువయ్యాయని, అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కావాలనే ఆయన్ని బుక్ చేసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!

భారీ అంచనాలతో వచ్చిన 'ఒక్క మగాడు' .. ప్లాప్‌కు కార‌ణాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>