Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2332620c-a0a6-42fa-9f85-da8ea2d3c5b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2332620c-a0a6-42fa-9f85-da8ea2d3c5b1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత పాలనలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రైతులకు అండగా నిలబడుతూ.. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. రైతు బీమా రైతు భరోసా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులందరికీ ఇప్పటికే చేయూత అందిస్తోంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో ఇక రైతులందరూ వ్యవసాయం చేసJagan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;chief minister;king;aqua;good news;good newwz;party;santoshamరైతులకు గుడ్ న్యూస్.. ఇక 10 ఎకరాలు ఉన్నా అర్హులే?రైతులకు గుడ్ న్యూస్.. ఇక 10 ఎకరాలు ఉన్నా అర్హులే?Jagan;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;chief minister;king;aqua;good news;good newwz;party;santoshamTue, 18 May 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత పాలనలో ఎన్నో మార్పులు వచ్చాయి.  ఇక పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది జగన్ ప్రభుత్వం.  ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా రైతులకు అండగా నిలబడుతూ.. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. రైతు బీమా రైతు భరోసా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులందరికీ ఇప్పటికే చేయూత అందిస్తోంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో ఇక రైతులందరూ వ్యవసాయం చేసేందుకు మరింత ప్రోత్సహించేలా.. ఇక రైతులందరికీ కూడా బోర్లు వేయించడమే కాదు కనెక్షన్ కూడా ఇప్పించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.



 ఎంతోమంది పేద, మధ్య తరగతి రైతులు తమ పంట పొలాల్లో బోర్లు లేక ఇబ్బంది పడుతున్నారని భావించిన జగన్ ప్రభుత్వం.. ఇక అర్హులైన రైతులందరికీ కూడా బోర్లు వేసి కనెక్షన్లు ఇప్పించడం వల్ల ఎంతో మంది రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతారని అప్పుడు రైతే రాజుగా మారుతాడు  అని జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పేద మధ్యతరగతి రైతులకు బోర్లు వేయించేందుకు సిద్ధమైంది.  దీనికోసం వైయస్సార్ జల కళ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం.  ఇక ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల వరకూ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు బోర్లు వేయించడమే కాదు కనెక్షన్ కూడా ఇప్పించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.



 ఇక ఇటీవలే మరోసారి ఈ పథకం పరిమితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం రైతులు అందరికీ శుభ వార్త చెప్పింది.  మొన్నటి వరకు కేవలం 5 ఎకరాల పంట పొలం ఉన్న రైతులకు మాత్రమే బోర్లు వేయించేందుకు సిద్ధమైంది.  5 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు అందరు ఈ పథకానికి అనర్హులు అంటూ తేల్చి చెప్పింది.  కానీ ఇటీవలి వైయస్సార్ జలకళ పథకంలో  ప్రభుత్వం మార్పులు చేసి పది ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులే అని ఇటీవలే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులందరికీ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ ప్రభుత్వం సూచించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సిఎంలను దగ్గర చేసుకోవడానికి మోడీ నానా కష్టాలు...?

కొవిషీల్డ్ తో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుందా.. క‌మిటీ ఏం తేల్చింది?

కొవిడ్ బాధితుల్లో ఎక్కువ‌వుతోన్న ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు??

రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

ఈట‌ల వైపా ? పార్టీనా ? సందిగ్ధంలో నేత‌లు .. కొంద‌రైతే ..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>