SportsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news5a67134d-5ad9-41cf-b0f9-5a4f3f45a59f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news5a67134d-5ad9-41cf-b0f9-5a4f3f45a59f-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఏస్థాయిలో కోరలు చాస్తుందో అందరికీ తెలిసిందే. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోవిడ్ ప్రభావం మరింత పెరిగింది. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ఇక గత ఏడాది కూడా కరోనా కారణంగా ఐపీఎల్ ను యుఏఈ లో నిర్వహించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ 14వ సీజన్ ఇండియాలోనే ప్రారంభించారు. sports news;amala akkineni;cricket;india;sourav ganguly;bcci;world cup;october;letter;icc t20;indianఐపీఎల్ మాత్రమే కాదు.. టీ20 వరల్డ్ కప్ కూడా డౌటే ..?ఐపీఎల్ మాత్రమే కాదు.. టీ20 వరల్డ్ కప్ కూడా డౌటే ..?sports news;amala akkineni;cricket;india;sourav ganguly;bcci;world cup;october;letter;icc t20;indianTue, 18 May 2021 16:00:00 GMT ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఏస్థాయిలో కోరలు చాస్తుందో అందరికీ తెలిసిందే. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోవిడ్ ప్రభావం మరింత పెరిగింది. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ఇక గత ఏడాది కూడా కరోనా కారణంగా ఐపీఎల్ ను యుఏఈ లో నిర్వహించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ 14వ సీజన్ ఇండియాలోనే ప్రారంభించారు.

ఇక ఈ సీజన్ లో ఇప్పటికే 29 మ్యాచ్ లు కూడా పూర్తి అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా ఒక్కసారిగా విజృంభించడం.. దాదాపుగా నాలుగు జట్ల ప్లేయర్లు కోవిడ్ బారిన పడడంతో ఐపీఎల్ అత్యవసర పాలక మండలి సమావేశంలో టోర్నమెంట్‌ను వాయిదా వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠినమైన నిర్ణయం తీసుకుంది. దీంతో టోర్నమెంట్ లో మిగిలిఉన్న 31 మ్యాచ్‌లు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఆ మద్య విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు రాగా, వాటిని బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపారేశారు.

దీంతో ఐపీఎల్ నిర్వహణ ఎప్పుడు ఉంటుంది  అనే దానిపై క్రికెట్ అభిమానుల్లో రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే జరగనుండగా ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ కప్ నిర్వహణ కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ 20 ప్రపంచ కప్ ఇండియా జరగవలసి ఉంది. అయితే అప్పటికి కూడా కరోనా తగ్గుముఖం పట్టకపోతే.. ఆ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం వేరే ఇతర దేశంలో టోర్నమెంట్ నిర్వహించడం మొదటిసారి అవుఃతుంది.    .    .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?

'ఆహా' ను నిలబెట్టడం కోసం అల్లు అరవింద్ అంత పనిచేస్తున్నాడా..?

నాగార్జునను బాగా బాధించిన ఆ ప్లాప్ సినిమా ఏంటి .. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>