MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/toofaanfeaf82f2-1d05-47d5-b4bc-13a7c1aa5472-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/toofaanfeaf82f2-1d05-47d5-b4bc-13a7c1aa5472-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లో స్టార్ హీరో కాకపోయినా ఫరాన్ అక్తర్‌కు మంచి ఫాలోయింగే ఉంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కేవలం నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, సింగర్‌గా ఇలా మరెన్నో విధాలుగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడు ఎంచుకునే కథలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. దాంతో అతడి సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్..toofaan;darshan kumar;kumaar;paresh rawal;geetha;jeevitha rajaseskhar;raj;vijay;bollywood;cinema;sangeetha;hero;heroine;joseph vijay;lie‘తుఫాన్’ వచ్చేది అప్పుడే..?‘తుఫాన్’ వచ్చేది అప్పుడే..?toofaan;darshan kumar;kumaar;paresh rawal;geetha;jeevitha rajaseskhar;raj;vijay;bollywood;cinema;sangeetha;hero;heroine;joseph vijay;lieTue, 18 May 2021 19:57:16 GMTబాలీవుడ్‌లో స్టార్ హీరో కాకపోయినా ఫరాన్ అక్తర్‌కు మంచి ఫాలోయింగే ఉంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కేవలం నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, సింగర్‌గా ఇలా మరెన్నో విధాలుగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడు ఎంచుకునే కథలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. దాంతో అతడి సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఫరాన్ సినిమా అంటే ఎంతో కొత్తగా, గొప్పగా ఉంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఫరాన్ కూడా తాను చేసే ప్రతి సినిమా కథను ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటాడు.


ఫరాన్ ఎప్పుడూ వచ్చే కథలను కాకుండా కొత్తగా ఉండే కథలకు ప్రాధాన్యం ఇస్తాడు. ఈ క్రమంలోనే జిందగీ నా మిలేగి దుబారా, భాగ్ మిల్కా బాగ్ వంటి వైవిధ్యమైన సినిమాలతో అందరినీ అలరించాడు. అదే విధంగా ఫరాన్ చేస్తున్న తాజా సినిమా ‘తుఫాన్’. ఈ సినిమా ఓ బాక్సర్ జీవిత నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో మ్రునాల్ ఠాకుర్ హీరోయిన్ పాత్రలో చేస్తుండగా పరేష్ రావల్, దర్శన్ కుమార్, విజయ్ రాజ్, గగన్ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అంతేకాకుండా  ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా  ఈ సినిమా థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్ర టీమ్ చెప్పింది. తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఓ వార్త బాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూలై మొదటి లేదా రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేద. త్వరలోనే చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తుందని సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేజ్రీవాల్, జగన్ బాటలోనే కేసీఆర్.. అదొక్కటేగా దారి..?

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>