MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-social-media-updates29ef6ada-e24c-4070-8736-140a8965319e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charmi-social-media-updates29ef6ada-e24c-4070-8736-140a8965319e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో పలువురు నటీమణులు హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై తమ కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకున్న అనంతరం కొన్నేళ్ళకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో స్థిరపడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అక్కడక్కడ మరికొందరు మాత్రం వివాహానంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ కొంత భిన్నంగా హీరోయిన్ గా కొనసాగుతున్న అనంతరం సడన్ గా నిర్మాతగా అవతారం ఎత్తారు అందాల బ్యూటీ ఛార్మి కౌర్. తొలిసారిగా నీ తోడు కావాలి అనే సినిcharmy-kaur;beauty;nithin;charmi kaur;puri jagannadh;suma;suma kanakala;sumanth;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;telugu;media;tamil;marriage;interview;heroine;joseph vijay;nithin reddy;devarakonda;mantraఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??charmy-kaur;beauty;nithin;charmi kaur;puri jagannadh;suma;suma kanakala;sumanth;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;telugu;media;tamil;marriage;interview;heroine;joseph vijay;nithin reddy;devarakonda;mantraMon, 17 May 2021 12:43:00 GMTసినిమా పరిశ్రమలో పలువురు నటీమణులు హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై తమ కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకున్న అనంతరం కొన్నేళ్ళకు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో స్థిరపడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అక్కడక్కడ మరికొందరు మాత్రం వివాహానంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ కొంత భిన్నంగా హీరోయిన్ గా కొనసాగుతున్న అనంతరం సడన్ గా నిర్మాతగా అవతారం ఎత్తారు అందాల బ్యూటీ ఛార్మి కౌర్. తొలిసారిగా నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన చార్మి ఆ తర్వాత ముజ్ సి దోస్తీ కరోగి అనే బాలీవుడ్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు.

అనంతరం తమిళ్, మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి ఛాన్స్ లు అందుకున్న చార్మి నితిన్ సరసన శ్రీ ఆంజనేయం సినిమా తో గౌరీ అలానే సుమంత్ సరసన గౌరి సినిమాల్లో నటించారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ఛార్మి, ఆపై కొన్నాళ్ల అనంతరం మంత్ర అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా భారీ హిట్ కొట్టారు. అయితే దాని తరువాత అక్కడక్కడా పలు సినిమాల్లో హీరోయిన్ చేసిన తద్వారా కొన్ని పరాజయాలు కూడా చవిచూడకతప్పలేదు. ఆపై అక్కడక్కడా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరిసిన ఛార్మి, పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారారు. ఆ మూవీ లో తానే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించడం జరిగింది. ఇక అక్కడి నుండి వరుసగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా లన్నిటికీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మీ ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండ తో తీస్తున్న లైగర్ మూవీకి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే నేడు ఛార్మీ జన్మదినం కావడంతో నిన్నటి నుండే పలువురు ఆమె అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మరికొందరయితే మీరు నిర్మాతగా కొనసాగకుండా మళ్ళీ హీరోయిన్ గా నటిస్తే బాగుంటుంది తప్పకుండా మీకు కెరీర్పర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి అని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక పై తనకి సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని తాను నిర్మాతగానే కొనసాగాలని భావిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఛార్మి వెల్లడించిన విషయం తెలిసిందే..... !!


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబు డైరక్షన్‌లో రాజుగారు...మరి వారి సంగతి ఏంటి?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>