PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/who-is-obstructing-the-formation-of-new-districts-in-ap-what-is-happening034fd563-ae98-4162-bbe1-4caab966c684-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/who-is-obstructing-the-formation-of-new-districts-in-ap-what-is-happening034fd563-ae98-4162-bbe1-4caab966c684-415x250-IndiaHerald.jpgఅవును దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో అవినీతి ఆరోపణలతో సురేష్‌బాబును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా రాజమండ్రి ఆర్జేసీగా సురేష్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ రాజమండ్రి ఆర్జేసీ బాధ్యతలను సురేష్‌బాబుకు అప్పగించనున్నారు. నిజానికి సురేశ్‌బాబుకు ప్రభుత్వం కandhra pradesh;editor mohan;vani;andhra pradesh;silver;ycp;rajahmundryఆ అవినీతి అధికారికి మళ్ళీ పోస్టింగ్!ఆ అవినీతి అధికారికి మళ్ళీ పోస్టింగ్!andhra pradesh;editor mohan;vani;andhra pradesh;silver;ycp;rajahmundryMon, 17 May 2021 20:00:00 GMTఅవును దుర్గగుడి మాజీ ఈవో సురేష్‌బాబుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. రాజమండ్రి దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్‌గా సురేష్‌బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గతంలో అవినీతి ఆరోపణలతో సురేష్‌బాబును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా రాజమండ్రి ఆర్జేసీగా సురేష్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ రాజమండ్రి ఆర్జేసీ బాధ్యతలను సురేష్‌బాబుకు అప్పగించనున్నారు. నిజానికి సురేశ్‌బాబుకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం షాకిచ్చింది. సురేశ్‌బాబు ఆర్జేసీ హోదాను దేవాదాయశాఖ‌ ర‌ద్దు చేసింది.


 అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితమే సురేష్‌బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీగా ప్రభుత్వం బ‌దిలీ చేసింది. ఆర్జేసీ నియామ‌క‌పు ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ జీవో 208 కూడా విడుదల చేశారు. దేవాదాయశాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని సురేష్‌బాబుకు ఆదేశాలు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఈవో సురేశ్‌బాబు స్థానంలో రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న డి.భ్రమరాంబను దుర్గగుడి ఈవోగా నియమిస్తూ నెల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


సురేశ్‌బాబును భ్రమరాంబ స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా నియమించారు. అనంతరం ఆయనకు  ఆర్జేసీ హోదా తొలగించగా ఇప్పుడు ఆ హోదా మళ్ళీ కట్టబెట్టారు. ఇక సురేశ్‌బాబు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళలో దుర్గగుడి ఈవోగా నియమితులయ్యారు. దుర్గగుడిలో అడుగుపెట్టిన నాటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన చివరికి అవినీతి ఆరోపణలతో వైదొలగాల్సి వచ్చింది. తాత్కాలిక పదోన్నతిపై డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఉన్న సురేశ్‌బాబును జాయింట్‌ కమిషనర్‌ స్థాయి ఆలయమైన దుర్గగుడికి ఈవోగా నియమించడంపై అప్పట్లో విమర్శలు వచ్చినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. వెండి సింహాలు ఘటన సహా అనేక అంశాలలో ఆయన పని తీరు, ఆరోపణల నేపధ్యంలో ఆయనని ప్రభుత్వం పక్కన పెట్టింది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌ళ్లీ మీసం మెలితిప్పిన ర‌ఘురామ‌రాజు..?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>