MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9261c013-8ea7-45f5-bdea-d4bf57b44936-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9261c013-8ea7-45f5-bdea-d4bf57b44936-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ కు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది.Prabhas;prabhas;aly khan;amala akkineni;saif ali khan;sunny singh;ali;indrajith;krishnam raju;seetha;hyderabad;bollywood;cinema;directorప్రభాస్ ఇలాంటివి కూడా నమ్ముతారా..?ప్రభాస్ ఇలాంటివి కూడా నమ్ముతారా..?Prabhas;prabhas;aly khan;amala akkineni;saif ali khan;sunny singh;ali;indrajith;krishnam raju;seetha;hyderabad;bollywood;cinema;directorMon, 17 May 2021 09:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మేకర్స్ కు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఇక సినిమా మొదలైన రోజే అగ్ని ప్రమాదం కావడం, సైఫ్ అలీ ఖాన్ వివాదం, ముంబైలో లాక్ డౌన్, హైదరాబాద్ లో కరోనా వల్ల కఠిన ఆంక్షలు అమలు కావడంతో ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటం గమనార్హం.

ఇక వచ్చే ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రాబోయే రోజుల్లో షూటింగ్ కు ఆటంకాలు ఏర్పడితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. అయితే షూటింగ్ మొదలుపెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ హోమం లాంటిది చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. శ్రీరామునికి సంబంధించిన కథ కావడంతో ఏదైనా దోషం ఉండవచ్చని నిర్మాతలు ప్రభాస్ తో మాట్లాడి హోమం చేయించబోతున్నట్టు భోగట్టా.

అయితే ప్రభాస్ ఇలాంటివి నమ్ముతారా..? అని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించనుండగా ఇంద్రజిత్ పాత్రలో అంగద్ బేడీ, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. టీసిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రభాన్ నటిస్తున్న తొలి మైథలాజికల్ ఫిల్మ్ ఇదే కావడం గమనార్హం. ఆదిపురుష్ సినిమా వల్ల మేకర్స్ కు ఎదురవుతున్న కష్టాలు హోమంతో తీరతాయో లేదో చూడాల్సి ఉంది మరి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐ కోర్టు.. అన్ని చోట్లా కీలక కేసులే..?

స్టైలిష్ స్టార్ సినిమా మ‌రో బాహుబ‌లి కానుందా..?

షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ భయం..

టాలీవుడ్ లో టాప్ టెన్ డిజాస్టర్ మూవీస్ ఇవే!

రౌడీ హీరోతో మహేష్ హీరోయిన్ ?

మే 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>