PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaya16526a9b-f775-4437-ba38-51e3b10eb59d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaya16526a9b-f775-4437-ba38-51e3b10eb59d-415x250-IndiaHerald.jpgఅందాల‌ జయప్రద తన పక్కన హీరోయిన్ గా నటిస్తాను అంటే ఎవరైనా కాదంటారా. అసలు జయప్రద కాల్షీట్లు ఒక టైమ్ లో అసలు దొరికేవే కాదు. ఆమె తొలి సినిమా నుంచే బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అందం అభినయం రెండూ సమ పాళ్ళలో మేళవించిన అద్భుతమైన నటీమణిగా జయప్రదను భారతీయ చిత్ర పరిశ్రమలో చెబుతారు. jaya;abinaya;jayaprada;tara;bollywood;cinema;producer;director;producer1;hero;heroine;vజయప్రదను వద్దన్న స్టార్ హీరో.... ?జయప్రదను వద్దన్న స్టార్ హీరో.... ?jaya;abinaya;jayaprada;tara;bollywood;cinema;producer;director;producer1;hero;heroine;vMon, 17 May 2021 19:00:00 GMTఅందాల‌ జయప్రద తన పక్కన హీరోయిన్ గా నటిస్తాను అంటే ఎవరైనా కాదంటారా. అసలు జయప్రద కాల్షీట్లు ఒక టైమ్ లో అసలు దొరికేవే కాదు. ఆమె తొలి సినిమా నుంచే బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అందం అభినయం రెండూ సమ పాళ్ళలో మేళవించిన అద్భుతమైన నటీమణిగా జయప్రదను భారతీయ చిత్ర పరిశ్రమలో చెబుతారు.

అలాంటి జయప్రద టాలెంట్ ని తొలి రోజుల్లోనే నాటి ప్రముఖ నిర్మాత ఎన్ వి సుబ్బరాజు గుర్తించారు. ఆయన్ శ్రీవాణి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్నో చక్కని సినిమాలు తీశారు. ఆయన అప్పట్లో క్రిష్ణం రాజు హీరోగా ఒకే రక్తం మూవీని తీయడానికి రెడీ అయ్యారు. ఆ మూవీలో హీరోయిన్ గా అప్పటికి భూమికోసం సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేసిన జయప్రదను తీసుకోవాలనుకున్నారు.

అయితే ఆమెను హీరోయిన్ అంటే క్రిష్ణం రాజు మొదట్లో అభ్యంతరం పెట్టారట. క్రిష్ణం రాజు ఆజానుభాహుడు. తన పక్కన పీలగా ఉన్న జయప్రద ఎలా సెట్ అవుతుంది అని ఆయన డౌట్ పెట్టారుట. ఇక ఆయన మాటతో ఆ మూవీ డైరెక్టర్ కూడా ఆమె వద్దు, జంట బాగుండదు అన్నారట. అయితే అప్పటికే జ‌యప్రద నటించిన సినిమాలను చూసిన నిర్మాత సుబ్బరాజు మాత్రం ఆమె హీరోయిన్ గా బాగా నప్పుతుంది అని ఓకే చెయించారుట.

మూవీ షూటింగులో ఉండగానే మరిన్ని సినిమాలు జయప్రద చేతిలోకి రావడంతో ఆ సినిమా రిలీజ్ నాటికే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయిందిట. ఇక యావరేజ్ మూవీ అవుతుంది అనుకున్న ఒకే రక్తం మూవీ కూడా సూపర్ హిట్ అయిందట. ఆ తరువాత జయప్రద క్రిష్ణం రాజు ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించారు. ఆ ఇద్దరి జోడీని కూడా జనాలు మెచ్చారు కూడా. అలాగే జయప్రద బాలీవుడ్ లో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. అక్కడా నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తన బెడ్ రూమ్ విషయాలు చెప్పిన కరీనా కపూర్..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>