MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/nagarjuna-wild-dog-praveen-sattaru-02e4ac73-4447-4f07-91a4-918c353e873b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/nagarjuna-wild-dog-praveen-sattaru-02e4ac73-4447-4f07-91a4-918c353e873b-415x250-IndiaHerald.jpgహీరో నాగార్జున తన ఇమేజ్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల వైల్డ్ డాగ్ మూవీలో నాగ్ నటనకు ప్రశంసలు లభించినా, సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో ఎన్నిరోజులు ఉందో అందరికీ తెలిసిందే. రాంగ్ టైమ్ లో విడుదల చేశామని నాగ్ చెబుతున్నా.. అలాంటి జానర్లు వెబ్ సిరీస్ కే ఎక్కువగా కనెక్ట్ అయ్యే రోజులివి. అయితే తాజాగా మరోసారి నాగ్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న సినిమా కూడా యాక్షన్ మూవీనే. nagarjuna, wild dog, praveen sattaru,;nagarjuna akkineni;dr rajasekhar;kajal aggarwal;praveen;ram madhav;cinema;london;marriage;love;moon;hero;guntur talkies;research and analysis wingపదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..nagarjuna, wild dog, praveen sattaru,;nagarjuna akkineni;dr rajasekhar;kajal aggarwal;praveen;ram madhav;cinema;london;marriage;love;moon;hero;guntur talkies;research and analysis wingMon, 17 May 2021 12:00:00 GMTహీరో నాగార్జున తన ఇమేజ్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల వైల్డ్ డాగ్ మూవీలో నాగ్ నటనకు ప్రశంసలు లభించినా, సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో ఎన్నిరోజులు ఉందో అందరికీ తెలిసిందే. రాంగ్ టైమ్ లో విడుదల చేశామని నాగ్ చెబుతున్నా.. అలాంటి జానర్లు వెబ్ సిరీస్ కే ఎక్కువగా కనెక్ట్ అయ్యే రోజులివి. అయితే తాజాగా మరోసారి నాగ్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న సినిమా కూడా యాక్షన్ మూవీనే.

ప్రవీణ్ సత్తారు మంచి సత్తా ఉన్న దర్శకుడు. లవ్ బిఫోర్ వెడ్డింగ్ ద్వారా దర్శకుడిగా పరిచయమై, పీఎస్వీ గరుడవేగ తో రాజశేఖర్ కి ఓ మెమొరబుల్ హిట్ ఇచ్చాడు. ఇటీవలే 'లెవంత్ అవర్' అంటూ ఓ వెబ్ సిరీస్ తో మెరిపించాడు. చందమామ కథలు, గుంటూర్ టాకీస్.. ఇలా అన్నీ విభిన్నమైన సినిమాలే తీశాడు. ఇప్పుడు నాగార్జునతో తొలిసారి ఓ యాక్షన్ మూవీ తీస్తున్నాడు. ఇందులో నాగ్ 'రా' ఏజెంట్ గా కనిపిస్తాడని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలొచ్చాయి కూడా. అయితే అలాంటిదేమీ లేదని కరోనా ప్రభావం తగ్గాక కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం.

నారాయణ దాస్‌ నారంగ్‌, రామమోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని నిర్మాతలు తెలిపారు. లండన్ లో షూటింగ్ జరపాలనుకుంటున్నారట. దీనికోసం చిత్ర బృందం లండన్‌ కు ప్రయాణం అవుతోందట. ఈ సినిమాలో నాగార్జునకి జంటగా కాజల్ నటిస్తోంది. ఓవైపు ఆచార్య మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న కాజల్, అదే సమయంలో నాగార్జునకి కూడా జంటగా కనిపించబోతోంది. పెళ్లి తర్వాత  కాజల్ స్పీడ్ తగ్గుతుందని అందరూ అనుకుంటున్నా.. ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో నటిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!

విపక్షం మరీ ఇంత వీకా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>