CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cookingbe6d9bfb-c664-4fff-80a3-fdfcbe3a7b80-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cookingbe6d9bfb-c664-4fff-80a3-fdfcbe3a7b80-415x250-IndiaHerald.jpgఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. అది ఏంటంటే పుల్ల పుల్లని కారం కారంగా ఉండే "గోంగూర పనీర్” రెసిపీ. ఈ కర్రీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. గోంగూరకి ఉన్న టేస్ట్ మరే కూరకి ఉండదు. అందుకే గోంగూరకి ఆంధ్రమాత అనే బిరుదు కూడా ఉంది తెలుసు కదా. అలాగే గోంగూరలో పన్నీర్ వేయడం వల్ల కూర రుచి ఇంకా బాగుంటుంది. మరి గోంగూర పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ! కావాల్సిన పదార్ధాలు: 200 gms పనీర్ లేత గోంగూర - ఓ పెద్ద కట్ట 3 చీలికలు పచ్చిమిర్చి 1/2 cup టమాటో పేస్టు 1 ఉల్లిపాయ సన్నని ;mirchi;onion;chilli;oil;cumin;salt;dried red chillies;gas stove;neem;red chilly powder;dhaniya powder;masalaఈ గోంగూర రెసిపీ టేస్ట్ ఒక్క‌సారి చూస్తే లైఫ్‌లో మ‌ర్చిపోరు.. ?ఈ గోంగూర రెసిపీ టేస్ట్ ఒక్క‌సారి చూస్తే లైఫ్‌లో మ‌ర్చిపోరు.. ?;mirchi;onion;chilli;oil;cumin;salt;dried red chillies;gas stove;neem;red chilly powder;dhaniya powder;masalaMon, 17 May 2021 12:00:00 GMTఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. అది ఏంటంటే  పుల్ల పుల్లని కారం కారంగా ఉండే "గోంగూర పనీర్” రెసిపీ. ఈ కర్రీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. గోంగూరకి ఉన్న టేస్ట్ మరే కూరకి ఉండదు. అందుకే గోంగూరకి ఆంధ్రమాత అనే బిరుదు కూడా ఉంది తెలుసు కదా. అలాగే గోంగూరలో పన్నీర్ వేయడం వల్ల కూర రుచి ఇంకా బాగుంటుంది. మరి గోంగూర పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు:

200 gms పనీర్
లేత గోంగూర - ఓ పెద్ద కట్ట
3 చీలికలు పచ్చిమిర్చి
1/2 cup టమాటో పేస్టు
1 ఉల్లిపాయ సన్నని తరుగు
1 tsp అల్లం వెల్లులి పేస్ట్
1 tsp గరం మసాలా పొడి
1 tsp ధనియాల పొడి
2 tsps కారం
1/2 tsp పసుపు
సాల్ట్
1 tsp వేయించిన జీలకర్ర పొడి
1/4 cup నూనె
1 tsp ఆవాలు
1 tsp జీలకర్ర
2 ఎండు మిర్చి
200 ml నీళ్ళు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటమనిపించండి.తరువాత ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి వేపాలి ఉల్లిపాయలు బంగారు రంగులోకి రావాలి. ఎర్రగా వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి వేపి ధనియాల పొడి, పసుపు , కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ వేసి వేపుకోండి.తరువాత గోంగూర ఆకు తరుగు వేసి ఆకు మెత్తగా మగ్గేదాక మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూర నూనెలో వేగితేనే జిగురు పోతుంది.గోంగూర మగ్గిన తరువాత అందులో  టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసి పచ్చిమిర్చి చీలికలు వేసి కూర దగ్గరపడే దాకా హై-ఫ్లేం మీద ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచిన పనీర్ ముక్కలను కూరలో వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే గోంగూర పన్నీర్ కూర రెడీ అయిపోయినట్లే.. ఈ కూర అన్నంలోకి అలాగే చపాతీలోకి అయినాగానీ చాలా బాగుంటుంది.. !



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!

విపక్షం మరీ ఇంత వీకా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>