Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha697e4cca-9641-478d-86a2-7258c7efccee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha697e4cca-9641-478d-86a2-7258c7efccee-415x250-IndiaHerald.jpgది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌కు అనేకమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అమెజాన్‌ ప్రైమ్‌లో అత్యధిక వ్యూవ్స్ సంపాదించుకుని టాప్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు దర్శకులు రాజ్ & డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ కంటెంట్ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తొలి సీజన్‌కు ఏ మాత్రం తగ్గకుండా రెండో సీజన్‌ను మరింత టాప్ రేంజ్‌లో..SAMANTHA;view;mahesh;badshah;nageshwara rao akkineni;raj;rajani;samantha;vijay;bollywood;tollywood;cinema;rajani kanth;amazon;hero;joseph vijayఅమ్మో! బోల్డ్ పాత్రలో సమంత..?అమ్మో! బోల్డ్ పాత్రలో సమంత..?SAMANTHA;view;mahesh;badshah;nageshwara rao akkineni;raj;rajani;samantha;vijay;bollywood;tollywood;cinema;rajani kanth;amazon;hero;joseph vijayMon, 17 May 2021 21:55:00 GMTఅమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌కు అనేకమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అమెజాన్‌ ప్రైమ్‌లో అత్యధిక వ్యూవ్స్ సంపాదించుకుని టాప్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. తెలుగు దర్శకులు రాజ్ & డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ కంటెంట్ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తొలి సీజన్‌కు ఏ మాత్రం తగ్గకుండా రెండో సీజన్‌ను మరింత టాప్ రేంజ్‌లో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను సైతం త్వరలో వెల్లడించేందుకు డైరెక్టర్లు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ రెండో సీజన్లో అక్కినేని కోడలు సమంత కూడా కీలక పాత్ర పోషించబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని డైరెక్టర్లు స్వయంగా వెల్లడించడంతో టాలీవుడ్ అభిమానుల్లో ఈ వెబ్‌ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సినిమాలో సమంత ఓ పాకిస్తానీ టెర్రరిస్ట్‌గా కనిపించనున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను బలపరిచేలానే తాజాగా బయటకొచ్చిన సమంత లుక్ కూడా ఉంది. దీంతో సమంత ఇంత బోల్డ్ అండ్ నెగెటివ్ క్యారెక్టర్ ఎలా చేస్తోందా..? అంటూ అభిమానులు షాకవుతున్నారు. మే 19న ఈ సీజన్ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, దాని ద్వారానే వెబ్ సిరీస్ రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడిస్తామని డైరెక్టర్లు రాజ్&డీకే వెల్లడించారు.

దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌పై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ డోస్ ఇంకా ఎక్కువగా ఉంటుందని, తొలి సీజన్ నచ్చినవారికి ఈ సీజన్ మరింత మజానిస్తుందని చిత్ర బృందం కచ్చితంగా చెబుతోంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఓ పెద్ద బడ్జెట్ సినిమాతోనే ముందుకు వచ్చేందుకు రాజ్&డీకే రెడీ అవుతున్నారు.అందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ఒక కథ కూడా వినిపించారట. అంతేకాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవర కొండలతో కూడా సినిమాలు చేసేందుకు వీరిద్దరూ రెడీ అవుతున్నారని సమాచారం.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబు డైరక్షన్‌లో రాజుగారు...మరి వారి సంగతి ఏంటి?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>