MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywood-disaster-movies18115d8a-dca8-4a42-8f2d-a7cf08807f25-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/tollywood-disaster-movies18115d8a-dca8-4a42-8f2d-a7cf08807f25-415x250-IndiaHerald.jpg సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ 2011-14 మద్యలో శిఖరాగ్రాన ఉందనే చెప్పాలి. దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వంటి సినిమాలతో మహేష్ హ్యాట్రిక్ విజయాలను అందుకొని నెంబర్ ఒన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా దూకుడు ప్రభంజనం బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగించిన ర్యాంపేజ్ మహేష్ అబిమానులు అంతా తేలికగా మర్చిపోలేరు. ఇక బిజినెస్ మెన్ లో ఒన్ మ్యాన్ షో గా మహేష్ పర్ఫామెన్స్ కు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో చిన్నోడిగా మహేష్ చేసిన చిలిపితనం ఫ్యామిలీ ఆడియనtollywood disaster movies;business;cbn;mahesh;kumaar;kranthi;kranti;mahesh babu;sukumar;makar sakranti;cinema;rajani kanth;sankranthi;cinema theater;january;hollywood;audience;director;box office;silver;letter;raccha;fidaaమహేష్ ను భయపెట్టిన మూవీ.. ఆసక్తికర విషయాలు !!మహేష్ ను భయపెట్టిన మూవీ.. ఆసక్తికర విషయాలు !!tollywood disaster movies;business;cbn;mahesh;kumaar;kranthi;kranti;mahesh babu;sukumar;makar sakranti;cinema;rajani kanth;sankranthi;cinema theater;january;hollywood;audience;director;box office;silver;letter;raccha;fidaaMon, 17 May 2021 08:09:04 GMT సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ 2011-14 మద్యలో శిఖరాగ్రాన ఉందనే చెప్పాలి. దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వంటి సినిమాలతో మహేష్ హ్యాట్రిక్ విజయాలను అందుకొని నెంబర్ ఒన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా దూకుడు ప్రభంజనం బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగించిన ర్యాంపేజ్ మహేష్ అబిమానులు అంతా తేలికగా మర్చిపోలేరు. ఇక బిజినెస్ మెన్ లో ఒన్ మ్యాన్ షో గా మహేష్ పర్ఫామెన్స్ కు ఫిదా అవ్వని అభిమాని ఉండడు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో చిన్నోడిగా మహేష్ చేసిన చిలిపితనం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇక మూడు డిఫరెంట్ జానర్స్ లో మూడు భారీ విజయాలను అందుకోవడంతో బాక్స్ ఆఫీస్ మహేష్ మ్యానియాతో ఊగిపోయింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ కు ఒక్క సారిగా బ్రేక్ వేసింది " 1 నేనొక్కడినే " చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టైటిల్, పోస్టర్స్, టీజర్ అన్నీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా 10 జనవరి 2014 న విడుదల అయింది.

మూవీ విడుదల రోజున రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసిన మహేష్ బాబు కటౌట్స్, పోస్టర్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రచ్చ చేశారు. ఇక థియేటర్ లోకి వెళ్ళిన ఆడియన్స్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. సినిమా ప్రారంభం నుండే అర్థంకాని స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ఐక్యూ కు పరీక్ష పెట్టింది. గత సినిమాలలో మహేష్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూసిన అభిమానులు " 1 నేనొక్కడినే " సినిమాలో మతిస్థిమితం లేని వాడిగా చూసి ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. దీంతో " 1 నేనొక్కడినే " మూవీ మొదటి షో నుండే భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న అర్థంకాని స్క్రీన్ ప్లే కారణంగా భారీ డిజాస్టర్ గా మిగిలి పోయింది.

 దాదాపుగా విడుదలకు ముందు 80 కోట్ల దాకా ప్రీరిలీజ్ బిజెనెస్ చేసిన ఈ చిత్రం అందులో సగం వసూళ్లను కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. దీంతో ఈ సినిమా రిజల్ట్ మహేష్ ను కాస్త భయానికి గురుచేసింది. ఈ మూవీ రిజల్ట్ మహేష్ బాబు పై ఎంతలా ప్రభావం చూపిందంటే, ఇకపై ఎప్పుడు ప్రయోగాలు చెయ్యను అని స్వయంగా మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. దీన్ని బట్టి మూవీ మహేష్ బాబును, ఆయన అభిమానులను ఏ స్థాయిలో డిస్సపాయింట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా వెండి తెరలో ఫ్లాప్ గా నిలిచినప్పటికి, బుల్లి తెరపై మాత్రం రిపీట్ ఆడియన్స్ ను సంపాదించుకుంది. ఏది ఏమైనప్పటికి " 1 నేనొక్కడినే " మూవీ మహేష్ బాబు కెరియర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలవడంతో పాటు అతి పెద్ద ఫ్లాప్ గా కూడా నిలిచింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో బ్లాక్ ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు...ఆ జిల్లాలోనే ఎక్కువ‌

షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ భయం..

టాలీవుడ్ లో టాప్ టెన్ డిజాస్టర్ మూవీస్ ఇవే!

రౌడీ హీరోతో మహేష్ హీరోయిన్ ?

మే 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>