PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus808af744-c05c-420d-9194-3baa303eccc1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/coronavirus808af744-c05c-420d-9194-3baa303eccc1-415x250-IndiaHerald.jpgమన దేశంలో కరోనా వైరస్ మనుషుల ప్రాణాలతో మరణక్రీడను ఆడుతోంది. ప్రభుత్వాలు మరియు వైద్య నిపుణులు ఎంత ప్రయత్నిస్తున్నా దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ వేవ్ లో చాలా ప్రమాదకరంగా మారుతోంది. CORONAVIRUS;bhumika chawla;kumaar;manu;vinod kumar;district;vitamin c;vitamin;chicken;protiens;doctor;cheque;aqua;letter;oxygen;protein;indian gooseberry;v;coronavirusకరోనా ఈ జాగ్రత్తలతో ఖతం ... జాగ్రత్తగా పాటించండి ?కరోనా ఈ జాగ్రత్తలతో ఖతం ... జాగ్రత్తగా పాటించండి ?CORONAVIRUS;bhumika chawla;kumaar;manu;vinod kumar;district;vitamin c;vitamin;chicken;protiens;doctor;cheque;aqua;letter;oxygen;protein;indian gooseberry;v;coronavirusMon, 17 May 2021 12:10:58 GMT
మన దేశంలో కరోనా వైరస్ మనుషుల ప్రాణాలతో మరణక్రీడను ఆడుతోంది. ప్రభుత్వాలు మరియు వైద్య నిపుణులు ఎంత ప్రయత్నిస్తున్నా దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ వేవ్ లో చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పుడు డాక్టర్స్ కరోనా వచ్చినప్పటికీ ఆందోళన, భయం చెందకుండా ధైర్యంగా ఉండి డాక్టర్స్ చెప్పే మెడికేషన్ మరియు సలహాలను తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా కరోనా నుండి రక్షించబడవచ్చని చెబుతున్నారు. తాజాగా మహారాజా జిల్లా కేంద్రాసుపత్రికి చెందిన వినోద్ కుమార్ లార్వాణి అనే డాక్టర్ కొన్ని కీలకమైన విషయాలను ఇంటర్వ్యూ ద్వారా తెలియచేశారు. ఈ సందర్బంగా పలు కీలక విషయాలను కరోనా ఒరుగులకు సూచించారు.

కరోనా లక్షణాలు మీకు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఎటువంటి భయం చెందకుండా పాజిటివ్ వచ్చిన తరువాత డాక్టర్ ని కలవండి.  

కరోనా వచ్చిన రోగులు ఆందోళన చెందకుండా దైర్యంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి.

కరోనా వైరస్ ముఖ్యంగా మూడు దశల్లో తన ప్రభావాన్ని చూపుతుంది. మొదటి ఆరు రోజుల వరకు మొదటి దశగా విభజించారు. ఈ దశలో జ్వరం, కాళ్లనొప్పులు, ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి రావడంతోనే మీరు డాక్టర్ ని కాంటాక్ట్ అవ్వాలి.

కరోనా లో రెండవ దశ 6 నుండి 14 రోజుల లోపు ఉంటుంది. ఈ దశలోనే జరగాల్సిన నష్టాలు జరిగిపోతున్నాయి. ఎక్కువగా ఆరోగ్యం పాడవడం...మరణించడం ఈ దశలోనే జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా దగ్గు మరియు ఆయాసం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు హాస్పిటల్ లో చేరి డాక్టర్స్ దగ్గర చికిత్స తీసుకుంటూ ఉండాలి. వీరికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది.

ఇక మూడో దశలో కొంతవరకు ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఇందులో దాదాపు మూడు  నెలల వరకు మొదటి దశలోని లక్షణాలే ఉంటాయి.

ముందు మీరు కరోనా కు సంబంధించి ఏ దశలో ఉన్నారో తెలుసుకుని ఆ దశకు తగినట్లుగా ఐసొలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకోవాలి.

మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆక్సిమీటర్ ను ద్వారా మీ ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా ఈ ఆక్సిమీటర్ ద్వారా 6 నిమిషాల వాట్ టెస్ట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ కరోనాను నియంత్రించడంలో చికిత్సతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్స్, పిండి పదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, చికెన్, గుడ్లు, మటన్ తీసుకోవాలి. ఒక వేళా మీకు మాంసం తినే అలవాటు లేకుంటే... పాలు  మరియు కూరగాయలు అధికంగా తీసుకోవాలి. పండ్లు కూడా విటమిన్ సి ఉండేవి తీసుకోవాలి. ఈ విటమిన్ సి అధికంగా ఆరంజ్, బత్తాయి, ఉసిరి మరియు నిమ్మకాయల్లో ఉంటుంది.

కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపై ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డి టాబ్లెట్స్ నాలుగు వారాలపాటు రోజుకు ఒకటి వాడాలి.

ఎటువంటి ఆలోచన చేయకుండా హాయిగా 8 గంటల పాటు నిద్ర పోవాలి. ఎక్కువగా కష్టం కలిగే పనులను చేయకూడదు. మీకు నచ్చిన పాటలను వింటూ ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇలా అన్ని చికిత్సలు తీసుకున్న తర్వాత కరోనా తగ్గింది అనుకుంటే...ఇప్పుడు మీరు డి డైమర్ పరీక్ష ను తప్పనిసరిగా చేసుకోవాలి.

అన్నిటికన్నా మించి లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మరింత కరోనా వ్యాప్తికి కారణం కాకుండా ఉండడం ముఖ్యం.

ఇలా పై సలహాలు మరియు సూచనలను ఆ డాక్టర్ కరోనా రోగులకు చెప్పడం జరిగింది.

 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ అరెస్ట్: కీలక మలుపు..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!

గందరగోళంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ?

తిరుమ‌ల భ‌క్తుల‌కు రాజ‌యోగం?

నువ్వా.. నేనా? వేడెక్కిన హుజురాబాద్ రాజ‌కీయం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>