HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-second-wave-dites-food82ebe1b2-736e-4f52-91e2-7cab9e7ee75f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-second-wave-dites-food82ebe1b2-736e-4f52-91e2-7cab9e7ee75f-415x250-IndiaHerald.jpgకరోనా ఇప్పుడు విలయతాండవం ఆడుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన వ్యక్తులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు, కషాయాలు, కొన్ని టాబ్లెట్ల వల్ల మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే పెరిగిపోదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే దీర్ఘకాలికంగా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుందని చెప్పవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు వారానికి రెంCORONA SECOND WAVE DITES FOOD;chiranjeevi;vitamin c;iron;vitamin;garlic;aqua;coffee;shaktiకరోనా సెకండ్ వేవ్ లో తీసుకోవాల్సిన డైట్ ఇదే..కరోనా సెకండ్ వేవ్ లో తీసుకోవాల్సిన డైట్ ఇదే..CORONA SECOND WAVE DITES FOOD;chiranjeevi;vitamin c;iron;vitamin;garlic;aqua;coffee;shaktiMon, 17 May 2021 22:00:00 GMT
కరోనా ఇప్పుడు విలయతాండవం ఆడుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన వ్యక్తులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


కేవలం కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు, కషాయాలు, కొన్ని టాబ్లెట్ల వల్ల మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే పెరిగిపోదు. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే దీర్ఘకాలికంగా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా చక్కగా పని చేస్తుందని చెప్పవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. కానీ వాటిని ఎక్కువగా నూనెలో వేయించి తినే కంటే, ఏదైనా ఆకుకూరలతో పాటు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.


శాకాహారులైతే ప్రోటీన్ల కోసం అన్ని రకాల పప్పు గింజలను ప్రతి రోజు తీసుకోవడం మంచిది. సి విటమిన్ కోసం జామ పండు, సపోటా, పచ్చి కూరగాయలు, (వండకుండా), మొలకెత్తిన గింజల తో చేసిన సలాడ్స్ ప్రతి పూట తీసుకోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఆకుకూరలు, గింజలు, కూరలు తీసుకోవడం వల్ల పోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ సమృద్ధిగా లభిస్తుంది.

ఇక నట్స్ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంచడానికి చాలా అత్యవసరంగా ఉపయోగపడతాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చినచెక్క లాంటివి రోజువారి వంట దినుసులు కూడా మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి సహకరిస్తాయి. ఫాస్ట్ ఫుడ్.. వేయించిన చిరుతిళ్ళు, స్వీట్లు మొదలైన వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరిమితిని మించి తీసుకునే టీ,కాఫీ,మద్యపానం రోగనిరోధక వ్యవస్థను చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇక ఇంట్లో చేసుకునే పదార్థాలు విటమిన్లు , పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. సమయానికి సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హిట్ కోసం అక్కినేని హీరో .. ఆ డైరెక్టర్ తో కలిశాడా..?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>