PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdb35c2fc-db54-428e-81c1-17b966e6b9ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdb35c2fc-db54-428e-81c1-17b966e6b9ad-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇక పట్టణాలతోపాటు గ్రామాలలోనూ కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 30 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా, కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి,ఆరోగ్య సౌకర్యాలను మరింతగా మెరుగుపర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులcoronavirus;modi;narendra modi;prime minister;local language;central government;oxygen;narendraగ్రామాల్లో కరోనా ఉధృతిపై కేంద్రం మార్గదర్శకాలు..గ్రామాల్లో కరోనా ఉధృతిపై కేంద్రం మార్గదర్శకాలు..coronavirus;modi;narendra modi;prime minister;local language;central government;oxygen;narendraMon, 17 May 2021 12:30:13 GMTఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది. పట్టణాలలో కేసులు చాలా ఎక్కువవుతున్నాయి.ఇక పట్టణాలతోపాటు ఇప్పుడు గ్రామాలలోనూ కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కరోనా మహమ్మారి పాజిటివిటీ రేటు 30 శాతం కంటే ఎక్కువగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా, కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి,ఆరోగ్య సౌకర్యాలను మరింతగా మెరుగుపర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


ఇక ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు, నిర్వహణతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలని సూచించడం జరిగింది.ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్ఎం, సీహెచ్వోలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని తెలిపింది.


ఇక కరోనా మహమ్మారి సోకిన వారి కేసుల సంఖ్య, వైరస్ తీవ్రతను బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పనిసరిగా చేయాలని తెలిపింది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను విస్తృతం చేయాలని తెలిపింది.ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. కరోనా లక్షణాలున్నవారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్ వైద్య సేవలందించాలన్నారు. కరోనా సోకినవారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లయితే వారిని జనరల్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కరోనా బారిన పడ్డవారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేలే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?

2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>