MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tejf1ce32fd-752d-4891-b11c-27d36838d737-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tejf1ce32fd-752d-4891-b11c-27d36838d737-415x250-IndiaHerald.jpgవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా తన టాలెంట్‌తో అందరినీ మెప్పించాడు. తన తొలి సినిమాతోనే వైష్ణవ్ 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఉప్పెనతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల..vaishnav tej;sports;nagarjuna akkineni;annapurna;krish;nageshwara rao akkineni;prasad;pruthvi;rakul preet singh;cinema;hero;yuva;vaishnav tej;hockeyఆ జానర్‌లో వైష్ణవ్ నెక్స్ట్ మూవీ.. ఎలా ఉంటుందో..?ఆ జానర్‌లో వైష్ణవ్ నెక్స్ట్ మూవీ.. ఎలా ఉంటుందో..?vaishnav tej;sports;nagarjuna akkineni;annapurna;krish;nageshwara rao akkineni;prasad;pruthvi;rakul preet singh;cinema;hero;yuva;vaishnav tej;hockeyMon, 17 May 2021 13:53:02 GMTవైష్ణవ్ తేజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే చిత్ర సీమలో సంచలనాలు సృష్టించాడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా తన టాలెంట్‌తో అందరినీ మెప్పించాడు. తన తొలి సినిమాతోనే వైష్ణవ్ 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఉప్పెనతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన తొలి సినిమా విడుదల కాకముందే క్రిష్ వంటి అగ్ర దర్శకుడి దగ్గర ఛాన్స్ కొట్టేశాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండో సినిమాను చేశాడు. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.


అయితే ఉప్పెన సినిమాతో స్టార్ హోదాను అందుకున్న వైష్ణవ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. క్రిష్‌తో చేసిన సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు వైష్ణవ్ పచ్చజెండా ఊపాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రూపొందనున్న సినిమాకు అక్కినేని నాగార్జున ఓ కొత్త దర్శకుడిని ఓకే చేశాడు. వీరి కాంబోలో రానున్న సినిమా అందరినీ మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.



ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైష్ణవ్ నటిస్తున్న సినిమాపై తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ సరికొత్తగా కనిపించనున్నాడని,  ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాను పృథ్వీ అనే కొత్త దర్శకుడు చేయనున్నాడు. ఇది హాకీ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని లాక్‌డౌన్ అనంతరం పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వైష్ణవ్ స్పోర్ట్స్ జానర్‌లోనూ అదరగొడతాడని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఈ సినిమాతో వైష్ణవ్ వారి అంచనాలను అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అవి పవర్ స్టార్, సూపర్ స్టార్ కెరీర్లోనే చెత్త సినిమాలు...

క్రేజీ కాంబోలో వచ్చిన మహేష్ సినిమా.. మరీ అలా బోల్తా కొట్టిందేంటి..?

'ప్లాస్మా’ థెరపీతో ప్రయోజనం లేదా..?

ఎలా మారినా క్రేజ్ మాత్రం తగ్గట్లేదే : ఆమె గ్లామర్ కి ఉన్న పవర్ అటువంటిది మరి ..... ??

సర్కారు వారి భారీ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే..?

పదే పదే అదే తప్పు చేస్తున్న నాగార్జున..

ప్లాన్ బీ అంటున్న మెగా పవర్ స్టార్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>