PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన ముందుకు వెళ్ళి అంశానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి పెద్ద గా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో పార్టీ నేతల్లో చాలా వరకు కూడా ఇబ్బందికర అభిప్రాయాలున్నాయి. భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని అందుకే ఆయన మాట్లాడే ప్రయత్నpavan kalayan,janasena,ap;pawan;kalyan;tiru;bharatiya janata party;janasena;telugu;tirupati;husband;janasena party;partyపవన్ ఈ భారాన్ని ఎప్పుడు వదిలించుకుంటారు...?పవన్ ఈ భారాన్ని ఎప్పుడు వదిలించుకుంటారు...?pavan kalayan,janasena,ap;pawan;kalyan;tiru;bharatiya janata party;janasena;telugu;tirupati;husband;janasena party;partyMon, 17 May 2021 10:00:00 GMTజనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన ముందుకు వెళ్ళి అంశానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి పెద్ద గా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో పార్టీ నేతల్లో చాలా వరకు కూడా ఇబ్బందికర అభిప్రాయాలున్నాయి.

 భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని అందుకే ఆయన మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీ అన్ని అంశాలలో కూడా వెనక్కు లాగుతూనే ఉంది. కాబట్టి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల నష్ట పోవడమే గానీ పెద్దగా పవన్ కళ్యాణ్ లాభపడేది అంటూ ఏమీ లేదు అనే విషయం చెప్పవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీని చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే.

కాబట్టి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల జనసేన పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీతో కలిసి చేయడంకంటే కూడా జనసేన పార్టీ సొంతంగా చేస్తే మంచిదని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితే మంచి ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీని పూర్తిగా పక్కన పెట్టకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పరువు కూడా పోయింది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్‌ను మ‌రింత రెచ్చ‌గొడుతున్న బాబు.. !

ప్రభాస్ ఇలాంటివి కూడా నమ్ముతారా..?

స్టైలిష్ స్టార్ సినిమా మ‌రో బాహుబ‌లి కానుందా..?

షుగర్ వ్యాధిగ్రస్తుల్లో బ్లాక్ ఫంగస్ భయం..

టాలీవుడ్ లో టాప్ టెన్ డిజాస్టర్ మూవీస్ ఇవే!

రౌడీ హీరోతో మహేష్ హీరోయిన్ ?

మే 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>