MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akash-movies-gurinchi-shooking-vishyalu0ad0e738-b7c8-44f0-b946-8755210f57f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akash-movies-gurinchi-shooking-vishyalu0ad0e738-b7c8-44f0-b946-8755210f57f3-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు ఎన్నోకలలతో స్టార్స్ అవుదామని అడుగు పెడుతూ వుంటారు. అయితే అలా అడుగు పెట్టిన కొంతమంది చిన్న చిన్నగా సినిమాలు మొదలు పెట్టి, స్టార్స్ గా ఎదిగిపోయారు. మరి కొంతమందేమో కొన్ని సినిమాలలో అద్భుతంగా నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరై, అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాంటి వారిలో ఆకాష్ కూడా ఒకరు. నిజానికీ ఆకాష్ శ్రీలంక లో పుట్టాడు అనే విషయం చాలా మందికి తెలియదు. మన దగ్గర లోనే ఉన్న శ్రీలంక అనే చిన్న దేశం నుండి వచ్చి, ఇక్కడ సినిమాలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకAKASH MOVIES GURINCHI SHOOKING VISHYALU;business;akash;ramu;sri lanka;cinema;london;tamil;producer;kannada;tamilnadu;producer1;heroహీరో ఆకాష్ గురించి బయటపడ్డ విస్తుపోయే నిజాలు.హీరో ఆకాష్ గురించి బయటపడ్డ విస్తుపోయే నిజాలు.AKASH MOVIES GURINCHI SHOOKING VISHYALU;business;akash;ramu;sri lanka;cinema;london;tamil;producer;kannada;tamilnadu;producer1;heroMon, 17 May 2021 17:00:00 GMT
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు ఎన్నోకలలతో స్టార్స్ అవుదామని అడుగు పెడుతూ వుంటారు. అయితే అలా అడుగు పెట్టిన కొంతమంది చిన్న చిన్నగా సినిమాలు మొదలు పెట్టి, స్టార్స్ గా ఎదిగిపోయారు. మరి కొంతమందేమో కొన్ని సినిమాలలో అద్భుతంగా నటించి, ప్రేక్షకులకు బాగా దగ్గరై,  అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాంటి వారిలో ఆకాష్ కూడా  ఒకరు. నిజానికీ ఆకాష్ శ్రీలంక లో పుట్టాడు అనే విషయం చాలా మందికి తెలియదు. మన దగ్గర లోనే ఉన్న శ్రీలంక అనే చిన్న దేశం నుండి వచ్చి, ఇక్కడ సినిమాలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాశ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.


శ్రీలంక నుంచి వచ్చి  తెలుగు ఇండస్ట్రీలో బాగానే సినిమాలు నటించాడు. అంతేకాకుండా తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకొని క్రేజీ హీరోగా మారిపోయాడు. 2001లో శ్రీనువైట్ల దర్శకత్వంలో "ఆనందం " లాంటి సినిమా తీసి బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.

ఈ చిత్రాల తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. పిలిస్తే పలుకుతా, నీతో చెప్పాలని, వసంతం, ఆనందమానందమాయే, అందాల రాముడు, నవ వసంతం, ఢీ,  నమో వెంకటేశ లాంటి చాలా సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక సినిమాలలో హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తూ విసిగిపోయి చివరకు పూర్తిగా నటనకు స్వస్తి చెప్పి, ఆ  తర్వాత  దర్శకుడిగా ఎంతోమంది కొత్త నటులను  సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.. ఆ  తరువాత ప్రొడ్యూసర్ గా మారి కూడా పలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది..


ఆకాష్ ని అందరూ తమిళనాడుకు చెందిన వారు అని అంటున్నారు. నిజానికి ఆకాష్ శ్రీలంకలోని కొలంబో ప్రాంతానికి చెందినవాడు. అక్కడే పుట్టి పెరిగాడు ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం వీరు తమిళనాడుకు వచ్చారు.ఇక శ్రీలంకన్ తమిళియన్ గా ఆకాష్ కి  పేరుంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే కొంతమంది పెద్దలు తన కెరియర్ ను తట్టుకోలేక తొక్కేశారంటూ  పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.


ఇక ఆకాష్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయన కుటుంబం రిచ్. వాళ్లకు శ్రీలంకలో టీ పౌడర్ బిజినెస్ కూడా ఉంది. అందులో బానే సంపాదించారు. అక్కడ్నుంచి లండన్ వెళ్లిపోయి సెటిల్ అయ్యారు. ఇండియాలో ఈయనకు కొన్ని గెస్ట్ హౌజ్‌లు కూడా ఉన్నాయి. మొత్తానికి సినిమాలు లేకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు ఈయన.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా బాధితుల కొరకు విక్రమ్ భారీ విరాళం..

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>