MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodha1f1d7d1-74c9-4a26-8c2c-c72da91fcee7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodha1f1d7d1-74c9-4a26-8c2c-c72da91fcee7-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య పెరగడంతో హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కూడా భారీగా ఏర్పడింది. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో ఈ ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే అలాంటి వారి ప్రాణాలు కాపాడటానికి ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దగ్గరనుంచి ఉంటూ ఎంతో మందికి సేవలు చేస్తూ ఆదుకుంటున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చి వారSonu Soodh;district;bus;collector;hero;letter;oxygenసోనూసూద్ ను సాయం కోరిన నెల్లూరు జిల్లా కలెక్టర్.. స్పందించిన రియల్ హీరో..!!సోనూసూద్ ను సాయం కోరిన నెల్లూరు జిల్లా కలెక్టర్.. స్పందించిన రియల్ హీరో..!!Sonu Soodh;district;bus;collector;hero;letter;oxygenMon, 17 May 2021 19:00:00 GMTదేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో రోగుల సంఖ్య పెరగడంతో హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కూడా భారీగా ఏర్పడింది. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో ఈ ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.అయితే అలాంటి వారి ప్రాణాలు కాపాడటానికి ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక  కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దగ్గరనుంచి ఉంటూ ఎంతో మందికి సేవలు చేస్తూ ఆదుకుంటున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చి వారిచేత దైవంగా కొనియాడబడ్డాడు ఈ రియల్ హీరో.

బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు. అంతటితో సోను సాయం ఆగిపోలేదు. వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశనలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు..దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజెన్ జనరేటన్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు రియల్ హీరో సోనూసూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజల ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్. 1.5 కోట్ల విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీఇచ్చారు. ఈ జనరేటర్ రోజూ 2 టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు..రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ రియల్ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ వర్సెస్ అదర్స్...?

డబుల్ ట్రీట్ సిద్దం చేస్తున్న యంగ్ టైగర్ ?

పవర్ స్టార్ చేసిన తప్పుని మెగాస్టార్ రిపీట్ చేస్తున్నాడా?

వైసీపీ వ్యూహాల‌కు బోల్తాప‌డుతున్న టీడీపీ!

నాగార్జున బాగా బాధించిన ఆ సినిమా ప్లాప్ ఏంటి .. ?

స్టార్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు..!!

ఎన్టీఆర్ కోసం రంగంలోకి అభిమానులు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>